
జగన్ స్వంత జిల్లా అభివృద్దిని పట్టించుకోకుండా రాష్టమంతా క్యాట్ వాక్ చేస్తున్నారని రాష్ట వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన బిజేపీ, వైసీపీలుతోడు దొంగలన్నారు.. వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోడీ ప్రేమలో పడ్డారని.. వారిద్దరూ ఇప్పుడు ప్రేమలో ఉన్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. మోడిని తిడితే లోపలేస్తారనే భయంతో జగన్ ఉన్నారన్నారు.. కబ్జాదారులకు, అవినీతిపరులకు అండగా ఉండే జగన్ ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ఆయన ప్రశ్నించారు.. కడప స్టీల్ ప్లాంట్ కోసం తమ ఎంపీ దీక్ష చేస్తుంటే వైసీపీ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు.. అంతకుముందు సర్వేపల్లి నియోజకవర్గంలోని అనికేపల్లి పంచాయతీకి చెందిన దాదాపు 60 మత్స్యకార కుటుంబాలు టీడీపీ తీర్దం పుచ్చుకున్నాయి.. వారిని మంత్రి సోమిరెడ్డి వలలు, సైకిళ్లు పంపిణీ చేశారు..