YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రవాసులకు అండగా వుంటాను : సీఎం చంద్రబాబు

ప్రవాసులకు అండగా వుంటాను : సీఎం చంద్రబాబు
ఇన్నోవేషన్ వ్యాలీ అంటే అమరావతి గుర్తుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నాడు అమరావతి పరిధిలో రాయపూడిలో ప్రవాసాంధ్రుల ఎన్ఆర్టీ ఐకానిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నాలుగేళ్లలో విజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. జేఈఈ పరీక్షల్లో 12 శాతం మంది తెలుగువారికి సీట్లు వస్తున్నాయని, బిట్స్పిలానీకి తెలుగువారికి 50 శాతం సీట్లు వస్తున్నాయన్నారు. విజ్ఞాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని పేర్కొన్నారు. ఏపి లో 30 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ లను 300 కాలేజ్ లు చేశాను. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రాముఖ్యత మన ప్రవాసాంధ్రులు ద్వారా మన రాష్ట్రానికి దక్కిందని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత దిక్కుతోచని పరిస్థితి వుండేది. మన పొట్ట కొట్టారు. చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అమరావతి కి సింగపూర్ ఆరునెలల కాలంలో రూపాయి కూడా తీసుకోకుండా మాష్టర్ ప్లాన్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు మేలు కలుగుతుందని నేను ఇచ్చిన హామీతో 33 వేల ఎకరాలు రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చారని అన్నారు. ఎన్  ఆర్ టి లు పెట్టుబడి పెట్టండి, గ్రామాలను అభివృద్ధి చేయండి. వాళ్లకు  అండగా ఉంటానని అన్నారు. అన్ని దేశాల్లో  తెలుగుజాతి ఆత్మగౌరవం పెంచండని అన్నారు. 

Related Posts