
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతినేల కొన్ని కుట్ర చేశారు. టీటీడీ వేదికగా బీజేపీ, వైసీపీ, జనసేన కుట్ర రాజకీయాల తెర తీసింది..దాన్ని మేము ఖండిస్తున్నామని ఉపముఖ్యమత్రి కె ఈ కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ ప్రతిష్టను పెంచటం జరిగింది. కొండ పైకి తెలుగు గంగ తీసుకువెళ్లాం. .రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం మెరుగుపరిచింది. వ్యవస్థ లో క్రమ శిక్షణ తీసుకోచ్చాం. పరిశుభ్రత లో టీటీడీ జాతీయ అంతర్జాతీయ లో మంచి పేరు ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు కు వెంకన్న ఇంటి కులదైవం. కుట్ర రాజకీయలు, రాజకీయ లాభం కోసం స్వామి వారి ఆభరణాలు పై ఆరోపణలు ఖండిస్తున్నామని అన్నారు. టీడీపీ పై కక్ష్య సాధింపులో భాగంగా టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయటం శోచనీయం. టీటీడీ పై రెండు కమిటీ వేశాం.. అవి వివరంగా నిజానిజాలను నివేదిక ఇచ్చారు. అవసరమైతే నివేదికలు కూడా బయట పెడతామని అయన అన్నారు. 1952 నుండి స్వామి వారి ఆభరణాలు రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. టీటీడీ వేదికగా మహా కుట్రకు బీజేపీ తెరతీసింది. ఈ కుట్రలో జనసేన వైసీపీ ప్రధాన సూత్రధారులని అయన ఆరోపించారు. పవన్ అంటే గాలి. గాలి వార్తలు నమ్మి వాటిని చెప్పటం తప పవన్ కు ఆలోచించే శక్తి లేదు. పవన్ ఒక అజ్ఞాత వాసి అని వ్యాఖ్యానించారు. రీల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు.ఎవరో రాసిఇచ్చి స్క్రిప్ట్ చదవటం పవన్ కి అలవాటు అయింది. ప్రజా క్షేత్రం లో ఉండే వారు బాధ్యత గా మెలగాలి..తప్పుడు ప్రచారం చేయకూడదని అయన సూచించారు. అమరావతి భూములు విషయం లో కూడా ప్రజలను పవన్ తప్పుదోవ పాటిస్తున్నాడు.. రాజధానికి రైతులు స్వచ్ఛంద భూములు ఇచ్చారు. రాజధానిలో పవన్ పర్యటిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. రమణ దీక్షితులు విశ్వసనీయత లేని వ్యక్తి..అయిన మాటలకు విలువలేదు. అలాంటి వ్యక్తులు పవన్ మద్దతు తెలపటం రాజకీయ కుట్రే. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చిన తరువాతనే ఇలంటి ఆరోపణలు చేస్తున్నారని అయన విమర్శించారు.