YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

‘యాంట్‌వోన్‌ ఫిషర్‌’ స్ఫూర్తిగా..

 ‘యాంట్‌వోన్‌ ఫిషర్‌’ స్ఫూర్తిగా..

-  ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’.

-  తొలిసారి మెగాఫోన్‌ పట్టి దర్శకత్వం వహిస్తున్న రచయిత వక్కంతం వంశీ

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. రచయిత వక్కంతం వంశీ తొలిసారి మెగాఫోన్‌ పట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌ ఇంపాక్ట్‌కు విశేష స్పందన వచ్చింది. ఆర్మీ అధికారి పాత్ర కోసం అల్లు అర్జున్‌ పడిన కష్టం అందులో స్పష్టంగా కనిపించింది. అయితే తాజాగా ఫిలింనగర్‌లో ఓ వార్త విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. ఓ హాలీవుడ్‌ చిత్రాన్ని ‘నా పేరు సూర్య..’ గుర్తుకు తేవడమే ఇందుకు కారణం.

2002లో విడుదలైన ‘యాంట్‌వోన్‌ ఫిషర్‌’ అనే సినిమాను ఫైండింగ్‌ ఫిష్‌ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. డెంజిల్ వాషింగ్టన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయకుడు అమెరికా నేవీ అధికారిగా కనిపిస్తాడు. ఈ సినిమాకు బన్ని చిత్రం దగ్గర ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్ననాటి పరిస్థితుల కారణంగా విపరీతమైన కోపం కలిగిన కథానాయకుడు దాన్ని తగ్గించుకునేందుకు కమాండింగ్‌ ఆఫీసర్‌ అయిన ఓ సైక్రియార్టిస్ట్‌ వద్దకు వెళ్తాడు. అతనే కథానాయకుడి గాడ్‌ ఫాదర్‌ అవుతాడు. అసలు కథానాయకుడు అలా తయారవడానికి కారణం ఏంటి? ఆర్మీ అధికారిగా ఎలా వచ్చాడు? చివరికి ఏమైంది? అనేదే ‘యాంట్‌వోన్‌ ఫిషర్‌’ కథ.

ప్రస్తుతం విడుదలైన ‘నా పేరు సూర్య’ ఫస్ట్‌ ఇంపాక్ట్‌ను చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. బన్ని చాలా సన్నివేశాల్లో కోపంగా కనిపించగా, గాడ్‌ఫాదర్‌‌ పాత్రలో రావు రమేష్‌ కనిపించారు. అయితే ఈ చిత్రం ‘యాంట్‌వోన్‌ ఫిషర్‌’ స్ఫూర్తిగా తీసుకున్నారా? లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ఇటీవల పవన్‌కల్యాణ్‌-త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఫ్రెంచ్‌ చిత్రం ‘లార్గోవించ్‌’నకు రీమేక్‌ అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ‘లార్గోవించ్‌’ దర్శకుడు మాత్రం చాలా సన్నివేశాలు తన సినిమాకు దగ్గరగా ఉన్నాయని చెప్పడం గమనార్హం.

Related Posts