YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఒక్కో పోస్టుకు 10 మంది దరఖాస్తులు

ఒక్కో పోస్టుకు 10 మంది దరఖాస్తులు
రాష్ట్రంలో 18 వేలకు పైగా భర్తీ చేయనున్న పోలీసు పోస్టులకు ఇప్పటి వరకు లక్షా 75 వేల ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందాయని రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌ వీవీ శ్రీనివాస్‌రావు  తెలిపారు. ఇందులో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌,ఏఆర్‌, టీఎస్‌ఎస్‌పీ,ఎస్‌పీఎఫ్‌) పోస్టులకు దాదాపు 45వేల దరఖాస్తులు అందాయని, కానిస్టేబుల్‌( సివిల్‌, ఏఆర్‌, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎప్‌) పోస్టులకు లక్షా 2వేల దరఖాస్తులు అందాయని ఆయన వివరించారు. అలాగే పోలీసు కమ్యూనికేషన్‌ ఎస్‌ఐ పోస్టులకు మూడువేలు, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో ఎఎస్‌ఐ పోస్టులకు రెండువేల దరఖాస్తులు అందాయని ఆయన తెలిపారు. అలాగే కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు మూడువేలు, కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) పోస్టులకు మూడు వేలు, మెకానిక్‌ పోస్టులకు ఐదు వందల దరఖాస్తులు అందాయన్నారు. ప్రస్తుతం రిక్రూట్‌మెంట్‌ జరుపుతున్న ఎస్‌ఐ పోస్టులలో ఎస్‌ఐ సివిల్‌ (పురుష, స్త్రీలు) 710 పోస్టులు, ఏఆర్‌ ఎస్‌ఐ (పురుష, స్త్రీలు) పోస్టులు 275, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ ఎస్‌ఐ(పురుష) పోస్టులు 5, టీఎస్‌ఎస్‌పీ (పురుష) పోస్టులు 175 ఉన్నాయని తెలిపారు. ఫైర్‌ సర్వీస్‌లో స్టేషన్‌ ఫైర్‌ ఆపీసర్‌ (ఎస్‌ఎఫ్‌ఓ) పోస్టులు 19, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌ పోస్టులు 15, అసిస్టెంట్‌ మెట్రన్‌ పోస్టులు 2 ఉన్నాయన్నారు. అలాగే ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ ఎస్‌ఐ పోస్టులు 29, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో ఎఎస్‌ఐ పోస్టులు 26లు ఉనానయని పేర్కొన్నారు. ఇక కానిస్టేబుల్‌( సివిల్‌(పురుష, స్త్రీ) పోస్టులు 5909, కానిస్టేబుల్‌ ఏఆర్‌(పురుష, స్త్రీ) పోస్టులు 5273, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 53, టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ పోస్టులు 4816, ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 485, ఫైర్‌ సర్వీస్‌లో ఫైర్‌మెన్‌ పోస్టులు 168, జైళ్ల శాఖలో వార్డర్‌ పోస్టులు 186, వార్టర్‌పోస్టులు(స్త్రీలు) 35లు ఉన్నయన్నారు. ఇన్‌ఫర్‌ మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌ (పురుష, స్త్రీలు) 142, పీటీవోలో మెకానిక్‌ పోస్టులు 19, డ్రైవర్‌ పోస్టులు 70 లు ఉన్నాయని శ్రీనివాస్‌రావు తెలిపారు.  దరఖాస్తులు చేసుకోవడానికి విధించిన గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తుందని ,ఈ తేదీని ఎట్టి పరిస్థితుల్లోను పొడిగించబోమని ఆయన స్పష్టం చేశారు. చివరి తేదీ వరకు అభ్యర్థులు వేచి చూడకుండా వెను వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. చివరి తేదీన ఒకే సారి దరఖాస్తులు చేసుకోవాలని భావిస్తే ఓవర్‌లోడ్‌కారణంగా సర్వర్‌ డౌన్‌ అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అలాగే పోలీసు పోస్టులు ఇప్పిస్తామని చెప్పి మభ్యపెట్టి డబ్బులు దోచుకుపోయే దళారీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి సమాచారాన్ని తమకు అందచేయాలని ఆయన కోరారు.

Related Posts