
నగరంలోని సివిల్స్ సప్లయ్స్ ఆఫీస్ లిఫ్ట్లో టీడీపీ నేతలు బుద్ధా రాజశేఖర్రెడ్డి, మీనాక్షినాయుడు చిక్కుకుపోయారు. 15 నిమిషాల పాటు లిఫ్ట్లోనే ఉండిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఇరువురు నేతలను లిఫ్ట్లో నుంచి క్షేమంగా బయటకు తీశారు. శనివారం నాడు రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా చల్లా రామకృష్ణారెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీశైలం ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అనుచరులతో కలిసి లిఫ్ట్లో వెళ్తుండగా అది మధ్యలో ఆగిపోయింది. వారంతా సుమారు పావుగంట పాటు లిఫ్ట్లో ఉండిపోయారు. వెంటనే పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది కర్రలు, రాడ్లతో లిఫ్ట్ను పగులగొట్టి వారిని సురక్షితంగా బయటకు తీశారు.