YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

జోయ్ అలుక్కాస్‌ బంగారు దుకాణాల్లో ఐటీ తనిఖీలు

జోయ్ అలుక్కాస్‌ బంగారు దుకాణాల్లో ఐటీ తనిఖీలు

దేశ వ్యాప్తంగా ఉన్న జోయ అలుక్కాస్ బంగారు దుకాణాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 130  ప్రాంతాల్లో ఉన్న జోయఅలుక్కాస్ బంగారు దుకాణాల్లో బుధవారం ఉదయం తనిఖీలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు స్పష్టం చేశారు. జోయఅలుక్కాస్ పన్ను ఎగవేత అభియోగాలపై సోదాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీ అధికారులు 7 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. షాపుల‌ను మూసివేశారు. ఉద్యోగుల‌ను లోప‌లికి వెళ్ల‌నివ్వ‌ లేదు. జోయ్ అలుకాస్ ప్ర‌ధాన కేంద్రం కేర‌ళ‌లో ఉన్న‌ది. క‌ర్నాట‌క‌, పుణె, కోల్‌క‌తాతో పాటు అహ్మ‌దాబాద్‌, రాజ్‌కోట్‌లోనూ ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. అమ్మ‌కాల వివ‌రాల‌ను దాచిపెట్టి, భారీ స్థాయిలో న‌గ‌దును డిపాజిట్ చేయ‌డం వ‌ల్ల జోయ్ అలుకాస్ షాపుల‌పై దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఐటీ అధికారులు చెప్పారు. మొత్తం 11 దేశాల్లో జోయ్ అలుకాస్‌కు బ్రాంచీలు ఉన్నాయి. కేర‌ళ‌కు చెందిన మంజ‌లీ జ్వ‌ల‌ర్స్ సంస్థ‌పైన కూడా ఐటీ శాఖ న‌జ‌ర్ వేసింది.

Related Posts