YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆదివారం... పార్టీ మారనున్న దానం నాగేందర్

ఆదివారం... పార్టీ మారనున్న దానం నాగేందర్
కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, గ్రేటర్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్‌  టిఆర్ఎస్ లో చేరటానికో రంగం సిద్ధం చేసుకున్నారా..... గ్రేటర్ ఎన్నికల ముందు హడావిడి చేసి వెనక్కి తగ్గిన దానం ఈ సారి కారెక్కటం ఖాయమేనా.. గ్రేటర్ లో మరింత బలోపేతం కావాలని చూస్తున్న టిఆర్ఎస్ ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందా.. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలను అవకాశంగా ఆపరేషన్ ఆకర్ష్ కు టిఆర్ఎస్ మరో సారి తెరలేపిందా.. అంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు దానం నాగేందర్ ఈ సారి ముహూర్తం నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకొంటారని పార్టీల్లో చర్చ జరుగుతోంది. దీంతో గ్రేటర్‌ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కొంత బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ బలమైన నాయకుల ను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది.  హైదరాబాద్ నగర పరిధిలో బలోపేతమయ్యేందుకు ప్రణాళికలు రూపొందించిన కేసీఆర్, మరింత మందిని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ తో పోలిస్తే టీడీపీకి అధిక ఓట్లు లభించాయన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి పడ్డ ఓట్లు, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేసరికి టీఆర్ఎస్ వైపు తిరిగాయి. ఇక వాటిని అలాగే కొనసాగించాలంటే, ఓ సామాజిక వర్గం ఓట్లు కీలకమని భావిస్తున్న టీఆర్ఎస్, ఆ వర్గానికి చెందిన బడా నేతలను ఆహ్వానిస్తోందని తెలుస్తోంది. గత కొంతకాలంగా నాగేందర్, ముకేశ్ లు టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దానం నాగేందర్ రాజీనామా తో గ్రేటర్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలోనే దానం నాగేందర్ ను టిఆర్ఎస్ లోకి తీసుకురావటానికి తీవ్ర ప్రయత్నాలు జరిపారు. అప్పుడు దానం నాగేందర్ పార్టీలోకి రావడానికి కొన్ని షరతులు పెట్టారని, ఆ షరతులకు టిఆర్ఎస్ అంగీకరించలేదని, దాంతోనే దానం యూటర్న్ తీసుకున్నారని చెబుతున్నారు. కానీ దానం నాగేందర్ అనుచరులు మాత్రం టిఆర్ఎస్ లో చేరిపోయారు. టిఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయమైందని అంతా అనుకున్న సమయంలో ఆయన అనుచరులు కూడా టిఆర్ఎస్ లోకి మారడానికి పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. కాని చివరి క్షణంలో దానం నాగేందర్ టిఆర్ఎస్ చేరిలేక పోయారు. దాంతో నగరంలోని ఆయన అనుచరులకు, కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లకు మాత్రం కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరిపోయారు. నాగేందర్ సొంత నియోజకవర్గం ఖైరతాబాద్ లో మాజీ కార్పొరేటర్ తో పాటు దానం అనుచరులను పెద్ద సంఖ్యలో మంత్రి కెటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిపోయారు.మాజీ మంత్రి దానం నాగేందర్ తో పాటు మరో మాజి మంత్రి ముఖేష్ గౌడ్ ఆయన తనయుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న సీట్లు చాలా తక్కువ. అందుకే టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఇప్పటికే టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇక గ్రేటర్ లో బలంగా ఉన్న కాంగ్రెస్ నేతలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వీరితో పాటు డివిజన్ల స్థాయిలోనూ ద్వితీయ శ్రేణి నేతలను ఆదరించడం ద్వారా మజ్లిస్ కు పట్టుండే 7 నియోజకవర్గాలు మినహా మిగతా అన్నింటినీ కైవసం చేసుకోవాలన్నది టీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది. మరోవైపు పూర్తిగా మజ్లిస్ ను నమ్ముకుని గ్రేటర్ లో రాజకీయం చేయటం కన్నా.. సొంత బలాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలో గులాబీ నేతలు ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓల్డ్ సిటీలోనూ మజ్లిస్ కు గట్టిపోటీ ఇచ్చింది టిఆర్ఎస్. అదే ఊపుతో ప్రభుత్వం లోకి వచ్చాక ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భవిష్యత్ ఎన్నికల్లో అభివృద్ధి ని చూపి ఓట్లు అడగటానికి దారులు ఏర్పాటు చెసుకున్నారు. మొత్తంగా గ్రేటర్ లో పార్టీని బలోపేతం చేయడానికి కేటిఆర్ నేతృత్వంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. రాజీనామా చేసిన దానం నాగేందర్ ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్, షబ్బీర్ అలీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు దానం కు గులాబీ కండువా కప్పేందుకు.. కె.కేశవరావు సారధ్యంలో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు గ్రేటర్ పరిధిలోని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు లతోను సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టిఆర్ఎస్.. గ్రేటర్ తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లోనూ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపనున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్, నల్గొండ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలను తమకు అనుకూలంగా మలుచుకుని ఆపరేషన్ మంత్ర ను మరోసారి వాడాలని టిఆర్ఎస్ చూస్తోంది. తాజాగా నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ల చేరికలపై డీకే అరుణ.. కాంగ్రెస్ అధిష్టానం పై నిప్పులు చెరిగారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఉత్తమ్ ల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు పై పార్టీ పెద్దలు పూర్తి స్థాయిలో పోరాడలేదని సంపత్, కోమటిరెడ్డి తీవ్ర నిరాశతో వున్నారు. ఈ అంశాలన్నింటిని తమకు అవకాశం గా మలుచుకుని ప్రయత్నాల్లో టిఆర్ఎస్ ఉంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలని టిఆర్ఎస్ భావిస్తోంది. గ్రేటర్ లో క్షేత్ర స్థాయిలో బలంగా ఉండేందుకే టిఆర్ఎస్ ఆకర్ష్ మంత్ర ప్రయోగిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల టార్గెట్ గానే టిఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts