YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతిలో బీఆర్ టీఎస్ రోడ్లు

 అమరావతిలో బీఆర్ టీఎస్ రోడ్లు
రాజధాని నగరాన్ని విజయవాడ, గుంటూరు నగరాలకు కలుపుతూ, అలాగే అంతర్గత రోడ్లను అనుసంధానిస్తూ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (బిఆర్‌టిఎస్‌) కారిడార్‌ నిర్మించేందుకు అవసరమైన సవివర ప్రణాళిక రూపొందించేందుకు సిఆర్‌డిఎ టెండర్లు ఆహ్వానించింది. అన్ని ప్రాంతాలనూ కలిపే విధంగా రెండు ప్రధాన రోడ్లు నిర్మించి వాటికి వాటిని ఈ కారిడార్‌ను అనుసంధానం చేయనున్నారు. బిఆర్‌టిఎస్‌కు అనుసంధానంగా ఉండే రెండు ప్రధాన కారిడార్లకు రాజధానిలో ప్రాంతంలోని అన్ని కలెక్టర్‌ రోడ్లు కలపనున్నారు. దీనికి అనుగుణంగా ప్లాను రూపొందించనున్నారు. తొలివిడతలో క్యాపిటల్‌ సిటీకి పశ్చిమాన ప్రభుత్వ కోర్‌కు అనుకుని ఉండే విధంగా ఒకటి, తూర్పున గేట్‌వే సిటీకి ఆనుకుని ఉండే విధంగా రెండు ప్రధాన రహదారులను నిర్మించి వీటిని 16వ నెంబరు జాతీయ రహదారికి కలుపుతారు. దీనిలోనూ గేట్‌వే సిటీకి అనుకుని ఉండే రోడ్డు ఇప్పటికే దాదాపు పూర్తయింది. తాడేపల్లిలో కొంత భూమిని సేకరించి అక్కడ ఫ్లైఓవర్‌ కడితే మొత్తం రాజధానికి ఇది అనుసంధానం అవుతుంది. మరోవైపు తూర్పు భాగంలో నగరానికి ఆహ్వానం పలికే విధంగా ఐకానిక్‌ వంతెన నిర్మించనున్నారు. దీనికి దాదాపు సర్వే పనులు పూర్తయ్యాయి. ఇది పూర్తయిన తరువాత దాన్ని బిఆర్‌టిఎస్‌ రోడ్డుకు అనుసంధానం చేయనున్నారు. ఈ రెండు కలపడం ద్వారా అటు మచిలీపట్నం, హైదరాబాద్‌ 65వ నెంబరు జాతీయ రహదారి, చెన్నై, కలకత్తా 16వ నెంబరు జాతీయ రహదారి రాజధాని నగరంలో నుండి అనుసంధానం అవుతాయి. అలాగే అటు గుంటూరు, ఇటు విజయవాడను కలిపే విధంగానూ కారిడార్‌ను రెండోదశలో విస్తరించనున్నారు. 2050 నాటికి అమరావతి, గుంటూరు, విజయవాడ నగరాలకు కలిపి 50 లక్షల మందికిపైగా జనాభా పెరుగుతుందని అదికారులు అంచనా వేశారు. రాజధానిలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలిపే విధంగా మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం(ఎంఆర్‌టి) ఏర్పాటు చేయనున్నారు. దీనిలో 1.2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఎంఆర్‌టి స్టేషన్లు నిర్మించనున్నారు. దీంతోపాటు విజయవాడలో ఇప్పటికే నిర్మించిన బిఆర్‌టిఎస్‌ కారిడార్‌ను దీనికి అనసంధానం చేయడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. రానున్న రోడ్డులో గుంటూరు, విజయవాడ కలిసిపోనున్నాయని, దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఎక్కువగా ఉంటుందని ఆర్‌ఎఫ్‌పిలో పేర్కొన్నారు. దీనికోసం ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాలని నిర్ణయించారు.

Related Posts