YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఒక కులానిదే పార్టీ పెత్తనం : దానం నాగేందర్

ఒక కులానిదే పార్టీ పెత్తనం : దానం నాగేందర్
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శక్తివంచన లేకుండా పని చేస్తున్నా,  ఇతర నేతలు ఆయనను పీతల్లాగా కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారని దానం నాగేందర్  అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత అయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేదని దానం ఆరోపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు... పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఒకే సామాజికవర్గానికి ప్రమోషన్ లు ఇస్తున్నారనే విషయాన్ని తాను ఆయనకే చెప్పానని... దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. కాంగ్రెస్ లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నొలకొందని చెప్పారు.  అయితే రాను రాను పరిస్థితుల్లో మార్పు వస్తుందని అన్నారు. పార్టీలోని కార్యకర్తలకు పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందని అన్నారు. 
పార్టీలో బీసీలకు ప్రాధాన్యం తగ్గుతోందని అందుకే బడుగు బలహీన వర్గాలకు చెందిన ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారని దానంఆరోపించారు.  డి. శ్రీనివాస్, కేశవరావు లాంటి వారు పార్టీ వీడడానికి కారణమిదేనని ఆయన అన్నారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి వారికి కూడా పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో బీసీల జనాభా 1.67కోట్లని, ఎన్నికలను ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న బీసీలకు పార్టీ పదవుల్లో, అధికారాల్లో మాత్రం ప్రాధాన్యత లేదని దానం విమర్శించారు. ఒకే వర్గానికి చెందిన వారు మాత్రమే పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు  ఈ విషయాన్ని తాను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పినట్లు, ఆయన కూడా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని అడిగినట్లు వెల్లడించారు.   కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యే నిర్వహించిన బస్సు యాత్రపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకే బస్సుయాత్రలో ప్రాధాన్యముందని, మిగతా సామాజిక వర్గానికి చెందిన నేతలకు అందులో చోటు దక్కలేదని విమర్శించారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వారిని మాత్రం పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అ త్మాభిమానం చంపుకోలేకే కాంగ్రెస్ కు రాజీనామా చేశానని తెలిపారు. తాను ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ... పార్టీ ప్రతిష్టను కాపాడేందుకే యత్నించానని అయన తెలిపారు. తనకు ఇంత కాలం అండగా ఉన్న పెద్దలందరికీ ఫోన్లు చేసి... తాను పార్టీలో ఉండలేననే విషయాన్ని చెప్పానని అన్నారు. తన రాజీనామావిషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు.

Related Posts