
టీపీసీసీ నేత దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరుతున్న ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో వెంటనే ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణలో పార్టీ పరిస్థితులు, బలోపేతం, కొత్త కమిటీ ఏర్పాటు, సంస్థాగత మార్పులపై ఉత్తమ్ కుమార్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చించనున్నట్లు తెలుస్తోంది. వార్ రూమ్ లో ఈ సమావేశం కొనసాగనుంది. 2019 ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై చర్చించనున్నట్లు సమాచారం.