YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ లో ఆత్మగౌరవం ఉండదు

కాంగ్రెస్ లో ఆత్మగౌరవం ఉండదు
ఆత్మగౌరవం లేని చోట పని చేయడం కంటే బయటకు వచ్చేయడం మంచిదని భావించే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు దానం నాగేందర్ తెలిపారు. త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతున్నానని చెప్పిన ఆయన.. మూడు దశాబ్దాలుగా వివిధ స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన తాను పార్టీ వీడటం వెనుకున్న కారణాలను వివరించారు. డీఎస్, కేశవ రావు లాంటి బీసీ నేతలు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లడానికి ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడమే కారణమని దానం ఆరోపించారు.గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్  అధ్యక్షుడు దానం నాగేందర్  పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో జరుగుతున్న అన్యాయం తనకు తెలియకుండానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 3.70 కోట్ల మంది జనాభాలో 1.67 కోట్ల మంది బీసీలే ఉన్నారు. నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బీసీలను పార్టీ పట్టించుకోవడం లేదని దానం తెలిపారు. ఈ విషయాలన్నీ రాహుల్ గాంధీకి చెప్పానని దానం చెప్పారు. వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకులు ఉండలేక ఉంటున్నారని దానం తెలిపారు. జెండా మోసిన కార్యకర్తలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును చూసి గర్వపడుతున్నానని  దానం నాగేందర్ స్పష్టం చేశారు. . కాంగ్రెస్ పార్టీ వీడడానికి గల కారణాలను వెల్లడించారు. ఏ పార్టీ చేయని విధంగా.. టీఆర్‌ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీని ఒకే వర్గానికి చెందిన వారు ఏలుతున్నారని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఆత్మగౌరవం లేని చోట.. ఉన్న ఒకటే.. లేకున్నా ఒకటే అని ఆయన స్పష్టం చేశారు. రాజీనామాకు గల కారణాలను ఆయన ఇవాళ మీడియా ఎదుట వెల్లడించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశాను. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించాను. ఒక సైనికుడిగా పని చేసినప్పటికీ.. చాకిరీగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దానం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలంతా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఏ మీటింగ్ జరిగినా ఒకే వర్గానికి చెందిన వారు వేదిక మీద ఉంటారు. వారే మాట్లాడుతారు. కానీ బీసీలకు అవకాశం ఇవ్వరు. డీ శ్రీనివాస్, కే కేశవరావు పార్టీని వీడడానికి గల కారణాలు ఏమిటి? పొన్నాల లక్ష్మయ్యకు ఎందుకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వీహెచ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు. ఆయన పార్టీలో మింగలేక.. కక్కలేక ఉన్నట్లు ఉందన్నారు. కేసీఆర్ పథకాలను చూసి పలువురు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. రైతుబంధు, రైతుబీమాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు.అయితే గులాబీ పార్టీలో చేరిక ఎప్పుడనే విషయంపై క్లారాటీ ఇవ్వలేదు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తర్వాత పదవులను ఆశించను. ఏ పని అప్పజెప్పినా బీసీల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన అనుచరులు, కొంతమంది కార్పొరేటర్లు తన వెంట ఉన్నారని తెలిపారు.

Related Posts