YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రెగ్యులర్ షూటింగ్ లో యాత్ర

రెగ్యులర్ షూటింగ్ లో యాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం నుంచి మొదలైంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టీ నటిస్తున్న ఈ సినిమా ఇలా పట్టాలెక్కింది. వైఎస్ చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను కథాంశంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా దీని రూపకర్తలు ప్రకటించారు. అందుకే టైటిల్‌ను ‘యాత్ర’గా పెట్టారు. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమాను పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మమ్ముట్టీ ఈ సినిమా సెట్స్ మీదకు అడుగుపెట్టిన సమయంలో గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు నిర్మాతలు. మమ్ముట్టీ నటించిన సూపర్ హిట్ సినిమా ‘దళపతి’లోని ‘సింగారాల..’ సాంగ్‌కు అనుగుణంగా డ్యాన్సర్లు డ్యాన్స్ చేయగా.. ఆ సమయంలో మమ్ముట్టీ అక్కడ అడుగుపెట్టారు. వాయిద్యాల హోరుతో ఈ విధంగా మలయాళ సూపర్ స్టార్‌కు వెల్కమ్ చెప్పింది ‘యాత్ర’ యూనిట్. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వైఎస్ అభిమానుల మధ్యన ఆ వీడియో వైరల్‌గా మారింది. మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ రూపొందుతోంది. శశి దేవిరెడ్డి, విజయ్ చిల్లాలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి. 

Related Posts