
పార్టీలో తనకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. అయితే పార్టీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడబోనని స్పష్టం చేశారు. ఆది నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నానని, చివరి వరకు పార్టీలోనే ఉంటానని అన్నారు. తాగాజా కాంగ్రెస్‌ను వీడిన దానం నాగేందర్.. పార్టీలో వీహెచ్ వంటి సీనియర్ నాయకులకు న్యాయం జరగేలేదని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన వీహెచ్.. దానం వ్యాఖ్యలు నిజమేనన్నారు. అయితే.. అగ్రకులాల ఆధిపత్యాన్ని అధిగమించాలి తప్ప.. భయపడి పారిపోవడం మంచిపద్దతి కాదన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే పార్టీ వేదికపైనే చర్చించాలన్నారు. తప్పు జరిగితే పార్టీ వేదికపైనే నిలదీస్తాననిభవిష్యత్లో కూడా ఇదే విధంగా ఉంటానని వీహెచ్ పేర్కొన్నారు. దానం ఎందుకు పార్టీ మారుతున్నారనేది ఆయన ఇష్టమన్నారు. తాము కాంగ్రెస్‌లోనే ఉండి..2019లో పార్టీని అధికారంలోకి తెస్తామని అన్నారు.