YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ కి ట్వీట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..!!

 కేటీఆర్ కి ట్వీట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..!!

‘‘భార‌తదేశంలో ఏయే రాష్ట్రాలు ప్లాస్టిక్‌ను బ్యాన్ చేశాయి? ప‌లు రంగాల్లో అగ్ర‌గామిగా నిలుస్తున్న‌మ‌న తెలంగాణ రాష్ట్రం పేరు ఈ జాబితాలో లేక‌పోవ‌డం నాకు నిరాశ క‌లిగించింది. ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించి భావి త‌రాల‌కు మంచి భ‌విష్య‌త్తును అందించేందుకు కృషి చేయాలి’’ అని కోరుతూ మంత్రి కేటీయార్‌కు ఈషా ట్వీట్ చేసింది.ఈ ట్వీట్‌పై కేటీయార్ తక్షణమే స్పందించారు. ‘‘చ‌ట్ట‌ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకున్నంత‌మాత్రన ప్లాస్టిక్ నిషేధం అనేది జ‌రిగే ప‌నికాదు. ప్లాస్టిక్ నిషేధం ప‌క్కాగా అమ‌లు కావాలంటే.. అధికారులకు, ప్ర‌జ‌లకు, ప్లాస్టిక్ తయారీదారుల‌కు స‌మ‌స్య తీవ్ర‌త గురించి అవ‌గాహ‌న క‌లగాలి’’ అంటూ కేటీయార్ స‌మాధాన‌మిచ్చారు.

Related Posts