YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరోసారి తేజ దర్శకత్వం లో కాజల్..!!

మరోసారి తేజ దర్శకత్వం లో కాజల్..!!
స్టార్ హీరోయిన్‌గా తనదైన శైళిలో రాణిస్తున్న కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా యాబై సినిమాలను పూర్తి చేసుకుంది. సీనియర్ హీరోలే కాదు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి కుర్ర హీరోలతో సైతం నటిస్తుంది ఈ అమ్మడు. కాజల్ అగర్వాల్‌ను ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం చేసిన దర్శకుడు తేజ.. ఆమె నటించిన యాబైవ చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని కూడా ఆయనే తెరకెక్కించారు. ఇప్పుడు తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ మరో సినిమా చేయబోతుంది. అంటే వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మూడోచిత్రం కాగా.. ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా?.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆల్ రెడీ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ కలిసి శ్రీనివాస్ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఇదే జంట తేజ దర్శకత్వంలో సినిమా చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

Related Posts