YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

అందుబాటులోకి స్మార్ట్ స్టెంట్

అందుబాటులోకి స్మార్ట్ స్టెంట్
 గుండె పోటు గురించి ముందుగా హెచ్చరించే వ్యవస్థ అందుబాటులో లేదు. తాజాగా బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుండెపోటు ముప్పును గుర్తించి హెచ్చరించే 'స్మార్ట్ స్టెంట్‌'ను రూపొందించారు. ఇది హృదయంలో రక్తప్రవాహాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తుంది. వైద్యరంగంలో ఉపయోగించే తుప్పు పట్టని ఉక్కుతోనే తాజా స్టెంట్‌ను తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణ స్టెంట్లలాగానే ఇది కనిపిస్తుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లోనే దాన్ని శరీరంలోకి సులువుగా ప్రవేశపెట్టవచ్చని తెలిపారు. ఈ కొత్తరకం స్టెంట్‌లో 'మైక్రో సెన్సార్‌'ను అమర్చారు. ఇది ధమనుల్లో రక్త ప్రసరణపై నిఘా వేసి రక్త ప్రవాహ వేగాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ధమని స్థితిగతులను, రక్త ప్రవాహ సమాచారాన్ని ఎప్పటికపుపడు వైర్‌లెస్ విధానంలో మన దగ్గర ఉండే రీడర్‌కు పంపుతుంది. గుండెపోటు ముప్పున్నవారికి వీటిని అమర్చడం ద్వారా జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Related Posts