
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 29, 30 డివిజన్లలో మంత్రి నారాయణ సోమవారం నాడు పర్యటించారు. ఈ సందర్బంగా అయన మునిసిపల్ జనరల్ ఫండ్ ద్వారా నగరంలోని అంగన్వాడి ప్రీ-స్కూల్స్ కు ఫర్నిచర్ అందజేసారు. 29, 30 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసారు. మంత్రి వెంట మేయర్ అజీజ్, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు కృష్ణారెడ్డి తదితరులు కుడా పర్యటించారు. మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధికి మంత్రి నారాయణ చేస్తున్న కృషి నిజంగా ప్రశంసనీయమైందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ విద్యలో విప్లవాత్మక సంస్కరణలు మంత్రి నారాయణ తీసుకువచ్చారని మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాబోయే రెండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్ని, ముఖ్యంగా మునిసిపల్ పాఠశాలలను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామని అన్నారు.