
బిజెపికి ఏపీలో ఎవరితో పొత్తులుండవు అందరూ రాజకీయ ప్రత్యర్థులేనని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. దీనికి సంబంధించి ఆధారాలు చూపిస్తున్న టిడిపి అబద్ధాలు చెబుతోందని అయన ఆరోపించారు. పోలవరం మొదలు మురుగు కాలువల నిర్మాణం వరకు టిడిపి ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పేదలకు ఇళ్లు నిర్మించాలన్న ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది ఏపీలో ఆ పథకం క్రింద ఇళ్ల నిర్మాణంలో న కూడా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలపై ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరాలని కేంద్రానికి లేఖ రాస్తానని అయన వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 3200 కోట్ల పైగా నిధులు కేటాయిస్తే అందులో ఖర్చు చేసింది వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే మిగిలిన డబ్బులు పక్క దారి మళ్లించారని అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అడ్డుపడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. ఏడు మాసాలుగా పూర్తిస్థాయి సమాచారం అడుగుతుంటే ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. సీఎం రమేష్ దీక్ష చేయాల్సింది కడపలో కాదు అమరావతిలోని సీఎం ఇంటిముందు. సీఎం రమేష్ వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని అయన అన్నారు.