YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బెజవాడ దుర్గగుడిలో మరో వివాదం

బెజవాడ దుర్గగుడిలో మరో వివాదం
బెజవాడ దుర్గమ్మ ఆలయంలో మరో వివాదం రేగింది. మొన్న క్షురుకులు-పాలకమండలి సభ్యుడి మధ్య గొడవను మర్చిపోకముందే ఈసారి ఏకంగా మహిళల డార్మిట్రీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై పెద్ద రగడ మొదలయ్యింది. దుర్గగుడి తరపున వన్‌టౌన్‌లోని సీవీ రెడ్డి ఛారిటీస్‌ సౌజన్యంతో భక్తుల కోసం డార్మిట్రీలను నిర్మించారు. పురుషులతో పాటూ మహిళల గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను గమనించిన కొందరు భక్తులు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇలా కెమెరాలు ఏర్పాటు చేస్తే మహిళలకు ఇబ్బందిగా ఉందని.. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఆలయ అధికారులు కూడా స్పందించారు. ఆ గదుల్లో సీసీ కెమెరాలు ఉన్నా.. అవి మూడు రోజులుగా పనిచేయడం లేదంటున్నారు. మహిళల భద్రత కోసమే వీటిని ఏర్పాటు చేశామని చెబుతున్నారు. కేవలం విశ్రాంతి తీసుకునే గదుల్లో మాత్రమే కెమెరాలు ఉన్నాయని.. బట్టలు మార్చుకునే గదులు వేరేగా ఉన్నాయంటున్నారు. ఇటు పాలకమండలి సభ్యులు ఒకరు ఈ వివాదంపై మాట్లాడారు. ఈ సీసీ కెమెరాల వ్యహారం తమ దృష్టికి వచ్చిందని.. సిబ్బందితో మాట్లాడి వాటిని తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Related Posts