
కమలాపూర్ మండలం నేరెళ్లలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. నేరెళ్ల నుంచి గునిపర్తి వరకు ఆర్టీసీ బస్సును మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో నేరెళ్ల నుంచి గునిపర్తి వరకు మంత్రి ఈటల రాజేందర్ ప్రయాణించారు. ప్రయాణికులు ఈ బస్సును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.