
తాము కాంగ్రెస్‌లోనే ఉంటామని పార్టీ ని వీడేది లేదని ముఖేష్ గౌడ్, విక్రమ్ గౌడ్‌లు స్పష్టం చేశారు.ఏఐసీసీ కార్యదర్శులతో పీసీసీ నేతల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఏఐసీసీ పెద్దలను కాంగ్రెస్ నేతలు ముఖేష్ గౌడ్, విక్రమ్ గౌడ్‌లు కలిశారు. తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌లోనే ఉంటామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి కుంతియా, బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్, డీకే అరుణ, చిన్నా రెడ్డి, సబిత తదితరులు హాజరయ్యారు.