YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తే..వెనక్కి పంపాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తే..వెనక్కి పంపాలి            అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తే.. కోర్టులు, కేసులు ఏమీ వొద్దని, తక్షణమే వెనక్కి పంపించేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. వారిపై న్యాయ విచారణ జరపాల్సిన అవసరం కూడా లేదని, చట్టప్రకారం ఉన్న న్యాయ విచారణ ప్రక్రియను తొలగించేయాలని ట్రంప్‌ పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద అక్రమంగా ప్రవేశించిన వారి నుంచి పిల్లలను వేరు చేసే విధానంపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్రంప్‌ ఇటీవల వెనక్కి తగ్గి ఆ విధానానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే దాదాపు 500 మంది చిన్నారులు వారి బంధువుల దగ్గరికి చేరారు.మెక్సికో, మధ్య అమెరికాతో ఉన్న సరిహద్దు వద్ద ప్రతినెలా వందల, వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్ వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ‘మన దేశంలోకి ఈ ఆక్రమణదారులను మేం అనుమతించలేము. ఎవరైనా అక్రమంగా వస్తే.. జడ్డిలు, కోర్టులు, కేసులు ఏమీ లేకుండా తక్షణమే వారిని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపేయాలి. మన వ్యవస్థ మంచి ఇమ్మిగ్రేషన్‌ పాలసీని, శాంతిభద్రతలను అపహాస్యం చేస్తోంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా వస్తున్నారు. మన వలస పాలసీని చూసి ప్రపంచం నవ్వుతోంది. విచారణకు ఏళ్ల సమయం పడుతోంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే వలసలు ఉండాలి. అమెరికాను తిరిగి గొప్పగా మార్చే ప్రజలు కావాలి’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అక్కడ చట్టప్రకారం ఉన్న న్యాయవిచారణ కూడా అవసరం లేదని ట్రంప్ అంటున్నారు. ఓ వైపు అమెరికా శాసనకర్తలు వలసవిధానం పాలసీపై ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తున్న సమయంలో ట్రంప్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Related Posts