YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

వినియోగదారులకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్..

వినియోగదారులకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్..

ఫిబ్రవరి 1 నుంచి ఆదివారం ఉచిత కాల్స్ బంద్!

 ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ల్యాండ్ లైన్ ద్వారా ఆదివారం నాడు చేసుకునే ఫ్రీకాల్స్ సౌకర్యాన్ని త్వరలో నిలిపివేయనుంది. దేశవ్యాప్తంగా ఆదివారం ఉచిత కాల్స్‌ ప్రయోజనాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో మిగతా రోజుల్లోగా ఇకపై ఆదివారం రోజు కూడా ల్యాండ్ లైన్, కోంబో, ఎఫ్‌టీటీహెచ్ బ్రాండ్‌బాండ్ ప్లాన్లపై చార్జీలు వర్తిస్తాయి. ఇందులో కొత్త, పాత వినియోగదారులు కలిపి ఈ చార్జీలు వర్తిస్తాయి.

ఇప్పటివరకూ రాత్రి 9 నుంచి ఉన్న నైట్ వాయిస్ కాలింగ్ స్కీమ్‌ను రాత్రి 10.30గా బీఎస్ఎన్ఎల్ సవరించినట్టు కాల్‌టెల్ టెక్నికల్ సెక్రటరీ సీజీఎమ్ గౌతమ్ చక్రవర్తి పేర్కొన్నారు. ఫ్రీ నైట్ కాలింగ్, ఆదివారం ఫ్రీ కాల్స్ సౌకర్యాన్ని గత ఏడాది ఆగస్టు 21న బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. కాగా, దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్‌లో 12 మిలియన్ల ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఉండగా, కోల్‌కతా టెలిఫోన్లలో మాత్రం ప్రస్తుతం 6 లక్షల వరకు ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఉన్నాయి. 

Related Posts