YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

దేశ బాహ్య రంగ అవకాశాలు ప్రకాశమానం

దేశ బాహ్య రంగ అవకాశాలు ప్రకాశమానం

-  దేశ ఎగుమతుల్లో 70 శాతం వాటా తెలంగాణతో సహా  ఐదు రాష్ట్రాలు

- సరుకుల ఎగువుతుల వాటా మాత్రం 1.7 శాతంగా మాత్రమే

-  పార్లమెంట్‌ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

 దేశ ఎగుమతుల్లో 70 శాతం వాటా తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళ నాడుల నుంచి వస్తున్నట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది.  చమురు ధరలు పెరిగితే సవుస్యలు తలెత్తగల అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వర్తకం పెరుగుతుందని భావిస్తున్నందు వల్ల దేశ బాహ్య రంగ అవకాశాలు ప్రకాశమానంగా కనిపిస్తున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 సంవత్సరపు ఆర్థిక సర్వేని సోమవారంనాడు పార్లమెంట్‌కు సవుర్పించారు. ‘‘అంతర్జాతీయ వర్తకం 2016లో 2.4 శాతంగా ఉన్నది  2017లో 4.2 శాతం, 2018లో 4 శాతం మేరకు వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నందున, భారతదేశపు బాహ్య రంగ అవకాశాలు ఈ ఏడాదిలోను, రానున్న సంవత్సరంలోను ఉజ్వలంగా కనిపిస్తున్నాయి’’ అని నివేదిక తెలిపింది. అయితే, ముడి చమురు ధరలు పెరిగితే వర్తక అవకాశాలు తగ్గవచ్చని పేర్కొంది. గుడ్డిలో మెల్లలా ప్రభుత్వానికి జమ అయ్యే మొత్తాలు పుంజుకోవడం ప్రారంభించాయని, అవి మరింత పెరగడానికి అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన జి.ఎస్.టి., లాజిస్టిక్స్, వర్తక వెసులుబాటు విధానాలు ఊతంగా పనిచేసి, విదేశీ వర్తకానికి మరింత సహాయుపడవచ్చని పేర్కొంది. దేశ సరుకుల ఎగువుతులు 2017-18 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 12 శాతం వృద్ధి చెంది, 223.51 బిలియన్ అవెురికన్ డాలర్లకు పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అదే కాలంలో అవి 199.46 బిలియన్ డాలర్ల మేరకు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలల కాలంలో దిగువుతులు 21.76 శాతం పెరిగి 338.36 బిలియన్ అవెురికన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫలితంగా, 114.85 బిలియన్ డాలర్ల మేరుక వాణిజ్య లోటు ఏర్పడింది. ‘‘భారతదేశ చరిత్రలో మొదటిసారిగా’’ అంతర్జాతీయ ఎగువుతులలో రాష్ట్రాల వాటాపై డాటాను ఇచ్చినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ డాటా ఎగువుతుల పనితీరుకు, రాష్ట్రాల జీవన ప్రమాణాలకు మధ్యనున్న సహసంబంధాన్ని సూచిస్తుంది. ‘‘అంతర్జాతీయ ఎగువుతులు చేసే, ఇతర రాష్ట్రాలతో వర్తకం చేసే రాష్ట్రాలు సంపన్నవువుతున్నట్లు కనుగొన్నారు. సంపదకు, అంతర్జాతీయ వర్తకానికి మధ్య అటువంటి సహసవున్వయం పటిష్టంగా ఉంది’’ అని నివేదిక పేర్కొంది. దేశ ఎగువుతుల్లో 70 శాతం వాటా ఐదు రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు తెలిపింది. వస్తువులు, సేవల ప్రపంచ వర్తక పరిమాణం ఈ ఏడాది వేగవంతవువుతుందని అంచనా వేసింది. ‘‘అంతర్జాతీయంగా పెరిగిన అనిశ్చితి, సంరక్షణవాదం, కఠిన వలస నిబంధనలు భారదేశపు సేవల ఎగువుతులను తీర్చిదిద్దడంలో కీలక అంశాలుగా పనిచేయువచ్చు’’ అని నివేదిక తెలిపింది. భారతదేశం 2016లో ప్రపంచంలో కవుర్షియల్ సర్వీసుల ఎగువుతులలో 3.4 శాతం వాటాతో ఎనిమిదవ పెద్ద దేశంగా నిలిచింది. ఎగువుతులలో సరుకుల ఎగువుతుల వాటా మాత్రం 1.7 శాతంగా మాత్రమే ఉంది.  

Related Posts