YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మ‌ధుబాబు న‌వ‌ల ఆధారంగా ఎన్టీఆర్ తో కొత్త చిత్రం..

మ‌ధుబాబు న‌వ‌ల ఆధారంగా  ఎన్టీఆర్ తో కొత్త చిత్రం..

న‌వ‌ల‌ల ఆధారంగా రూపొందే సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణే ఉంటుంది. గ‌తంలో ప‌లు తెలుగు సినిమాలు పాపుల‌ర్ న‌వ‌ల‌ల‌కు తెర రూపంగా వ‌చ్చి విజ‌యం సాధించాయి. ఇటీవ‌ల కాలంలో ఈ త‌ర‌హా చిత్రాలు త‌గ్గాయి. అయితే, ఆ మ‌ధ్య వచ్చిన 'అఆ' చిత్రాన్ని న‌వ‌ల ఆధారంగానే తెర‌కెక్కించారు త్రివిక్ర‌మ్‌. అంతేగాకుండా, త‌న త‌దుప‌రి చిత్రాన్ని కూడా ఓ న‌వ‌ల ఆధారంగా రూపొందించ‌నున్నార‌ని తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించ‌నున్న సినిమా.. మ‌ధుబాబు న‌వ‌ల ఆధారంగా రూపొంద‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచార‌మ్‌. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది. 

Related Posts