YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

చైనా దూకుడుకు భారత్‌ నిశ్శబ్ధంగా చెక్‌..?

 చైనా దూకుడుకు భారత్‌ నిశ్శబ్ధంగా చెక్‌..?

- నిమిషాల్లో చైనాపై దాడికి సిద్ధం చేసిన భారత్

- ముక్కున వేలేసుకున్న అమెరికారక్షణశాఖ

భారత్ వ్యూహాలను ఇటీవల అమెరికా ఉపగ్రహం తీసిన ఫోటో చూసి.. అమెరికాకు చెందిన రక్షణశాఖ విశ్లేషకులు పరిశీలించి అవాక్కయ్యారుచైనా దూకుడుకు భారత్‌ నిశ్శబ్ధంగా చెక్‌పెట్టడాన్ని అమెరికా చూసి ముక్కున వేలేసుకుంది

డిసెంబర్‌లో చైనా డోక్లామ్‌ వద్ద ఏకంగా భారీ సైనిక స్థావరాన్ని నిర్మించింది.. దీంతో పెరుగుతున్న ముప్పును పసిగట్టిన భారత్‌ తాపీగా దానికి చెక్‌పెట్టింది. భారత్‌ చైనాల మధ్య జరుగుతున్న సైలెంట్‌ వార్‌కు సంబంధించిన దృశ్యాలను ఇటీవల అమెరికా ఉపగ్రహం ఒకటి చిత్రీకరించింది. దీనిని అమెరికాకు చెందిన రక్షణశాఖ విశ్లేషకులు పరిశీలించి అవాక్కయ్యారు. చైనా దూకుడుకు భారత్‌ నిశ్శబ్ధంగా చెక్‌పెట్టడాన్ని చూసి ముక్కున వేలేసుకుంది.

డోక్లామ్‌కు సంబంధించినంత వరకు భారత్‌కు బాగ్‌డోగ్రా ఎయిర్‌ బేస్‌ అత్యంత కీలకమైంది. దీంతోపాటు చైనాకు సమీపంలో పశ్చిమ బంగాలో ఉన్న హసిమర ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. డోక్లామ్‌ వద్ద పరిస్థితి ఏమాత్రం తేడా వచ్చినా నిమిషాల్లో అక్కడ మోహరించే విధంగా ఈ విమానాశ్రయాలను భారత్‌ సిద్ధం చేసింది. ఈ రెండు చోట్ల భారత్‌ వాయుసేనలోని అత్యున్నత శ్రేణికి చెందిన సుఖోయ్‌ 30 ఎంకేఐలను మోహరించింది. ఈ విమానాలు 300 కేజీల బరువు ఉన్న వ్యూహాత్మక ఆయుధాలను (అణ్వాయుధాలు) కూడా ప్రయోగించగలవు. దీంతోపాటు ఇటీవలే వీటికి బ్రహ్మోస్‌ క్షిపణులను కూడా అమర్చే ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అంటే వాయుమార్గంలో చైనా భారత్‌పై దాడి చేసే అవకాశాలను దాదాపు అడ్డుకున్నట్లే.

Related Posts