YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బోసిపోతున్న కృష్ణమ్మ బిరబిరలు

బోసిపోతున్న కృష్ణమ్మ బిరబిరలు
రాష్ట్ర ప్రజల నీటి అవసరాలను తీర్చే కృష్ణమ్మ బిరబిరలు బోసిపోయాయి. అన్నదాతలను ఆదుకునే జలకళలు కరువయ్యాయి. ఖరీఫ్ పనులు మొదలుపె ట్టాలంటేనే భయం వేసే పరిస్థితి నెలకొంది. కారణం కృష్ణా నదిపై ఉన్న ప్రధాన జలాశయమైన శ్రీశైలం డ్యాం పూర్తిగా అడుగంటిపోవడమే. కనీసం నీటి మట్టం 854 అడుగులు ఉంటే కానీ ఆశాజనకంగా పనులను ముందుకు సాగించడం కష్టం. అలాంటిది ప్రస్తుతం నీటి మట్టం భారీ స్థాయిలో తగ్గిపోయింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 800.01 అడుగులకు చేరుకుంది. 15 రోజుల క్రితం పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 0.31 టీఎంసీలు మాత్రమే డ్యామ్‌లోకి వచ్చి చేరాయి. ఆ తర్వాత ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపో యింది. వరద ప్రవాహం గానీ, పైనున్న ప్రాజెక్టుల నుంచి నీటి రాక గానీ లేకపోవడంతో పాటు నిల్వ ఉన్న నీరు కూడా పూర్తిగా అడుగంటిపో యాయి. దీంతో కుడి, ఎడమ బ్రాంచిలపైనున్న విద్యుత్ కేంద్రా ల్లో ఉత్పత్తి నిలిపివేశారు. గత ఏడాది భారీ వర్షాలు కురిసి డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరినా విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారం దిగువకు నీటిని వదల డంతో డ్యాంలో నీటిమట్టం డెడ్ స్టోరేజికి చేరువైంది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంతవరకు భారీ వర్షాలు కురవలేదు. ఎగువ నుంచి కూడా నీటి ప్రవాహం లేదు. డ్యాం నిండితేగాని కృష్ణాజలాలపై ధారపడిన రైతాంగానికి సాగునీరు అందడం కష్టంగా కనిపిస్తోంది. అదే ప్రభుత్వాలు శ్రీశైలం డ్యాంలో కనీస నీటిమట్టం 854 అడుగులకు తగ్గకుండా చూసి ఉంటే ఖరీఫ్‌లో సాగుకు సకాలంలో నీరు అందించడానికి అవకాశం ఉండేదని రైతులు, రైతు సంఘాల నాయ కులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని వాడడం వల్లే డెడ్ స్టోరేజికి చేరువైందంటు న్నారు. కృష్ణా జలాలపై ఆధారపడిన ఆయకట్టు రైతులకు నీరు రావాలంటే డ్యాంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితే తప్ప సాధ్యం కాదని చెబుతు న్నారు. దీంతో వరుణుడి వైపు ఆశగా ఎదురు చూస్తు న్నారు. మరి వరుణుడు కరుణిస్తాడా.. ఉసురుమనిపిస్తాడా తేలాల్సి ఉంది.

Related Posts