YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజీనామాకు సిద్ధమైన రేవంత్..?

రాజీనామాకు సిద్ధమైన రేవంత్..?

 -  ముందస్తు ఎన్నికలకు కాలుదువ్వుతున్న కాంగ్రెస్

ముందస్తు ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని తెలంగాణ సీఎల్పీనేత, సీనియర్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "రేవంత్  రెడ్డి రాజీనామాకు సిద్ధంగా ఉన్నాడు. ముందు రాజీనామా ఇచ్చిన వారిని ఆమోదిస్తే రేవంత్ కూడా సిద్ధమే. డిలిమిటేషన్ జరగదనేది మా అభిప్రాయం. దీనిపై వాళ్లేం చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్నికల సమయంలో కూటమి ప్రయత్నం సహజమే. కాంగ్రెస్ ఆ ప్రయత్నంలోనే ఉంది.. క్లారిటీ వస్తే చెబుతాం. 102 సీట్లు గెలుస్తామని చెప్పడం మా శ్రేణులను బలహీన పరిచే ప్రయత్నంలో భాగమే. ప్రజాభిప్రాయం మావైపే ఉందని విశ్వసిస్తున్నాం" అని జానారెడ్డి మీడియాకు వివరించారు. డీలిమిటేషన్ జరగదనేది మా అభిప్రాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ పై వాళ్లేం చేసినా మాకు అభ్యంతరం  లేదన్నారు.సమయం, ఇతర పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదనుకుంటున్నాం.ఎన్నికల సమయంలో కూటమి ప్రయత్నం సహజం.కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేస్తుంది.దానిపై ఏదైనా క్లారిటీ వస్తే చెబుతాం.మహాభారతంలో ఎక్కువ అస్త్రాలు, జనం కౌరవుల వద్దే ఉన్నాయి.అయినా పాండవులే గెలిచారు.ప్రజాభిప్రాయం మావైపే ఉందని మేం విశ్వసిస్తున్నాం.రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లోనే రెండు పంటలు వేస్తున్నారు.ఇందులో 62 శాతం రైతులు 2.5 ఎకరాల లోపే భూమి కలిగి ఉన్నారు.మెజారిటీ రైతులకు రూ. రెండు నుంచి మూడు వేల లోపే పెట్టుబడి సాయం అందుతుంది.అదే గిట్టుబాటు ధర, బోనస్ కల్పిస్తే రైతుకు మేలు.వ్యవసాయ ఉత్పత్తులు క్వింటాలుకు రూ. వంద తగ్గినా ఇచ్చే పెట్టుబడి సాయం చెల్లుకుచెల్లవుతుందన్నారు.

Related Posts