YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

బీజేపీకి ఎంపీ, రాజస్థాన్ టెన్షన్

బీజేపీకి ఎంపీ, రాజస్థాన్ టెన్షన్
జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న బీజేపీ ఆలోచనను కొన్ని పక్షాలు వ్యతిరేకిస్తుండగా మరికొన్ని సమర్థిస్తున్నాయి. ముఖ్యంగా జమిలి ఎన్నికలకన్నా ముఖ్యంగా ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫీవర్ కమలనాధులకు పట్టుకుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపుపై కమలనాధులకు నమ్మకం కుదరడం లేదు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం, అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో పడనుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కన్పిస్తోంది.ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకమే. అయితే గెలుపు అంత ఈజీ కాదన్నది పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలియంది కాదు. అందుకే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడానికి ప్రధాని నరేంద్రమోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కసరత్తులు ప్రారంభించారు. మూడు రాష్ట్రాలకూ ఇప్పటికే రాష్ట్రీయ స్వయం సేవక్ లను పంపించి వేశారు. ప్రతి పోలింగ్ బూత్ ను కవర్ చేసేలా ఆర్ఎస్ఎస్ సాయం తీసుకోవాలని నిర్ణయించారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కమలం పార్టీకి కొంత ఆశ ఉన్నది ఛత్తీస్ ఘడ్ మాత్రమే. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇటీవల కొన్ని సంస్థలు జరిపిన సర్వేల్లోనూ బీజేపీకి వ్యతిరేక ఫలితాలు రావడం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం బాగా పుంజుకుందన్న వార్తలు కూడా కమలనాధులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఛత్తీస్ ఘడ్ లో మాత్రం కొంత పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజేలపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశముంది.ఇద్దరు ముఖ్యమంత్రులపైన వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు ప్రకటించకపోవడం ఒక ప్లాన్ గా కేంద్ర నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ ఇక్కడ అధికారంలోకి మళ్లీ రావాలంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరొకరని ఎన్నికల సమయంలోనే ప్రొజెక్ట్ చేయాలని మరో ఆలోచనలో కూడా బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యే సమాయానికి ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. మరి బీజేపీ ప్రయోగాలు ఫలిస్తాయో? లేదో? అన్నది చూడాల్సి ఉంది

Related Posts