YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇది ప్రజాకర్షక బడ్జెట్‌..?

 ఇది ప్రజాకర్షక బడ్జెట్‌..?

మోదీ ప్రభుత్వం మరి కొద్ది గంటల్లో 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఇది ప్రజాకర్షక బడ్జెట్‌గా ఉండొచ్చని భావిస్తున్నారు.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టి ఓ వైపు వచ్చే సంవత్సరం జరుగనున్న ఎన్నికల మీదా, మరోవైపు ద్రవ్య లోటును పూడ్చుకోవడం పైనా ఉండక తప్పదు.

ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం, దీనిపై ఆసక్తి ఎక్కువగానే ఉన్నాయి. అయితే బడ్జెట్‌ ప్రసంగాన్ని, బడ్జెట్‌తో ముడిపడిన వ్యవహారాలను అర్థం చేసుకోవాలంటే ఈ పది ప్రాథమిక అంశాలు మీరు తెలుసుకోవాల్సిందే.

ఆర్థిక సర్వే..కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే ప్రభావం తర్వాత వచ్చే బడ్జెట్‌‌పై ఉంటుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో 2017-18 ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7 నుంచి 7.5 శాతం వృద్ధి చెందొచ్చని సర్వే నివేదిక వెల్లడించింది.

ఆదాయ పన్ను మినహాయింపు..ఈసారి కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఆ అంచనాల గురించి తెలుసుకోవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి..

బడ్జెట్ సమావేశాలు: వ్యూహాలు, ప్రతివ్యూహాలు

2019 సాధారణ ఎన్నికల ముందు బీజేపీ ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. ఓ రకంగా చెప్పాలంటే, 16వ లోక్‌సభలో ఇది బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి సంపూర్ణ బడ్జెట్ అవుతుంది. 2019లో లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్నాయనేది తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతన్న సందర్భంగా పలు రంగాలకు చెందిన వారిని 'బీబీసీ' పలకరించింది. వారేమనుకుంటున్నారో చూడండి..

ఓ ప్రైవేట్ ఉద్యోగి అభిప్రాయాలు..రక్షణ బడ్జెట్‌లో రెండు శాతం శానిటరీ ప్యాడ్లకు ఖర్చు చేయాలంటున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఎందుకో తెలుసుకోండి మరి..దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం సహకారం అందించాలని అంటున్నారు.. అంజలి అనే ఓ విద్యార్థిని.మోదీ చెప్పిన మంచి రోజుల గురించి ఒక క్షురకుడు ఏం చెబుతున్నారో.. బడ్జెట్ నుంచి ఏం కోరుకుంటున్నారో చూడండి..

జీఎస్టీ గురించి..బడ్జెట్ అంటే గుర్తుకొచ్చేది.. ఏయే వస్తువుల ధరలు ఎంత తగ్గాయి? ఎంత పెరిగాయి? అన్న ప్రకటనలు. అయితే, ఈ సారి ఆ సమాచారం ఉండకపోవచ్చు. కారణం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావటమే. 2017లో వచ్చిన సంస్కరణలు భారత ఆర్ధిక వ్యవస్థకు మేలు చేశాయా? దీనిపై ఆర్థిక రంగ నిపుణులు పెంటపాటి పుల్లారావు ఏమంటున్నారో చూడండి..

మోదీ ప్రకటనలపై ప్రజలేమంటున్నారంటే..

డబ్బులు ఇవ్వాలంటే బడ్జెట్‌లోనే ప్రకటించాల్సిన పనిలేదు. కొన్ని నెలల కిందట 20 విశ్వవిద్యాలయాలకు రూ.10 వేల కోట్లను ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అప్పుడు సోషల్ మీడియాలో ప్రజలు ఏమన్నారు?

2018 గురించి 2017 ఏం చెబుతోంది?..ఆర్థిక రంగం విషయంలో నరేంద్రమోదీ ఎదుర్కొన్న అతి క్లిష్టమైన సంవత్సరం 2017 అని బీబీసీ ప్రతినిధి సమీర్ హష్మీ చెప్తున్నారు. మరి కొత్త సంవత్సరంలో ఆర్థిక విధానాలు ఎలా ఉండొచ్చు?

మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే ఒక్కసారి దీన్ని చూడండి..బడ్జెట్‌లో ఇచ్చే రాయితీలను బట్టి ఫోన్ల ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. అయితే, బడ్జెట్ సంగతి పక్కన పెడితే.. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్‌గా ఉన్న చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు భారీగా పతనమయ్యాయి. అందుకు కారణాలేంటి? తెలుసుకోండి..

అమెరికా బడ్జెట్‌..ఈ ఏడాది జనవరిలో అమెరికా బడ్జెట్‌కు ఆమోదం లభించలేదు. దీంతో అక్కడ ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా సకాలంలో అందలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. దీనిపై బీబీసీ సమగ్ర కథనాలు ఒకసారి చూడండి.

 

Related Posts