YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా

 పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా

పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం మొదలైంది. తొలిసారి బడ్జెట్ ప్రసంగం హిందీలో ప్రారంభం కావడం విశేషం.

తన ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లిష్ భాషలలో కొనసాగిస్తున్నారు.పలువురు విశ్లేషకులు ఊహించినట్టుగానే పేదలకు భారీ పథకాల ప్రకటనలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయి.

బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:

వ్యవసాయ రంగం:

2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం.

వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి.

ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను ఒకటిన్నర రెట్లు పెంచింది.

85 శాతం కన్నా ఎక్కువ మంది చిన్న, మధ్య తరగతి రైతులే.

గ్రామీణ వ్యవసాయ మార్కెట్ల ఏర్పాటుకు రూ. 2,000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం.

చేపల పెంపకం, ఆక్వా కల్చర్ అభివృద్ధి, పశుసంరక్షణ కోసం రూ. 10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం.

గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మంత్రిత్వ శాఖలు కలిసి రూ. 14.34 లక్షల కోట్లు చేశాయి.

పంట వ్యర్థాలను తగులపెట్టకుండా, ఇతర ప్రక్రియలో తొలగించడం కోసం ప్రత్యేక సబ్సిడీ.

ఆదివాసుల కోసం రూ. 56,000 కోట్లు

విద్యారంగం:

బ్లాక్ బోర్డు నుంచి డిజిటల్ బోర్డు వైపు

ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచడానికి ఇంటిగ్రేటెడ్ బీ.ఎడ్ కోర్సు

వైద్యం:

10 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా జాతీయ వైద్య పథకం

ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకం

1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలు తెరుస్తాం.

ప్రతి మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు.

పరిశ్రమలు:

చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 3,700 కోట్లు

ఉద్యోగ కల్పన - ఉపాధి:

అన్ని రంగాలలో కొత్త ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం 12 శాతం జమ చేస్తుంది.

ముద్రా రుణాలకు రూ. 10.38 లక్షల కోట్లు...అరుణ్ జైట్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

Related Posts