YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఇమ్రాన్ ఖాన్‌ కు తలనొప్పిగా మారిన మాజీ భార్య

ఇమ్రాన్ ఖాన్‌ కు తలనొప్పిగా మారిన మాజీ భార్య
పాక్‌ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్ అధినేత నేత ఇమ్రాన్‌ ఖాన్‌‌ గురించి మాజీ భార్య రెహమ్ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్‌కు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. ఈ విషయాలన్నింటిని ఆమె తన 'రెహమ్ ఖాన్' పుస్తకంలో వివరించారు. గత కొన్నాళ్లుగా ఈ పుస్తకంలోని కీలక అంశాలను లీక్ చేస్తూ  మార్కెట్లోకి పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకంలో తమ పది నెలల వైవాహిక జీవితం, ఇమ్రాన్ రాజకీయ, వ్యక్తిగత జీవితం గురించి ఇందులో వివరించింది. ఇమ్రాన్‌ ఖాన్‌కు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని.. అంతేకాదు ఇమ్రాన్‌తో సంతానం పొందినవారిలో కొందరు భారత మహిళలు కూడా ఉన్నారు. వాళ్లంతా తమ వైవాహిక జీవితంలో పిల్లలను కనలేకపోవడంతో తనతో సంతానం పొందినట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పేవారని రెహమ్ వెల్లడించింది. ఆయనకున్న సంతానం గురించి ఇమ్రాన్ తనకు వెల్లడించారని, ఈ విషయాలు ఆయన మొదటి భార్య జెమ్మిమా గోల్డ్‌ స్మిత్‌కు తెలుసని రెహమ్ తెలిపింది.ఇమ్రాన్‌‌‌కు సితా వైట్‌కు జన్మించిన టైరియన్‌ వైట్ గురించి మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో ఆయన టైరియన్‌ వైట్ ఒక్కతే కాదని, తనకు ఐదుగురు సంతానం ఉన్నారని వెల్లడించాడు. వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారని చెప్పారని.. వాళ్లంతా తమ వైవాహిక జీవితంలో పిల్లలను కనలేకపోవడంతో తనతో సంతానం పొందినట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పేవారని రెహమ్ వెల్లడించింది. అలాగే ఆయనకున్న పిల్లల్లో అతి పెద్దవాళ్ల వయసు 34 ఏళ్లని చెప్పినట్లు తెలిపింది. అంతేకాదు ఇమ్రాన్‌తో సంతానం పొందినవారిలో కొందరు భారత మహిళలు కూడా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ స్వలింగ సంపర్కం కూడా చేసేవారని ఆమె తెలిపింది. ఆయన క్లోజ్ ఫ్రెండ్ మోబీతో ఇమ్రాన్‌కు శారీరక సంబంధం ఉందని ఆమె పేర్కొంది. మోబీకి అప్పటికే పెళ్లి కూడా అయినట్లు పుస్తకంలో ఆమె వెల్లడించింది. ఇమ్రాన్ బెడ్‌రూమ్‌లో ఖాళీ సిగార్ కేసులు, కేవై జెల్లీ ట్యూబులు ఉండేవని అందులో పేర్కొంది. ఇమ్రాన్‌కు పాక్‌ ప్రధాని కావాలని కోరిక ఉండేదని పుస్తకంలో వివరించింది. ఇమ్రాన్‌కు మాదకద్రవ్యాల అలవాటు ఉందని.. బాత్‌రూమ్‌లో కొకైన్ తీసుకుంటుండగా తాను చాలాసార్లు చూసినట్లు తెలిపింది. ఆయన పాల్పడిన అవినీతి గురించి ఆమె ఆ పుస్తకంలో క్షుణ్నంగా వివరించారు. జులై 25న ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె వెల్లడించిన విషయాలు ఆయన ఇతర రాజకీయ పక్షాలకు ఆయుధాలుగా మారనున్నాయి.

Related Posts