YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

విఫలమైన బ్యాట్స్‌మెన్‌...రెండో వన్డేలో భారత్‌ ఘోర పరాజయం..!!

Highlights

  •  రూట్ మెరుపు శతకం 
     
  • రాణించిన మోర్గాన్ 
     
  • రైనా, కోహ్లీ శ్రమ వృధా 
విఫలమైన బ్యాట్స్‌మెన్‌...రెండో వన్డేలో  భారత్‌ ఘోర పరాజయం..!!

బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో రెండో వన్డేలో భారత్‌ భంగపడింది. రూట్‌ (113; 116 బంతుల్లో 8×4, 1×6) సెంచరీ బాదడంతో శనివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 86 పరుగుల తేడాతో గెలిచింది.  రూట్‌ శతకానికి మోర్గాన్‌ (53; 51 బంతుల్లో 4×4, 1×6), విల్లీ (50 నాటౌట్‌; 31 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు తోడవడంతో మొదట ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 322 పరుగులు సాధించింది. లక్ష్యఛేదనలో తడబడిన భారత్‌ 50 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. రైనా (46; 63 బంతుల్లో 1×4), కోహ్లి (45; 56 బంతుల్లో 2×4) రాణించారు. ప్లంకెట్‌ (4/46), రషీద్‌ (2/38), విల్లీ (2/48) భారత్‌ను దెబ్బతీశారు. రూట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరుగుతుంది.

Related Posts