YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ధోని రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చినా రవిశాస్త్రి..!!

 ధోని రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చినా రవిశాస్త్రి..!!

 మంగళవారం ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డే సందర్భంగా మ్యాచ్‌ ముగియగానే ఆటగాళ్లందరు మైదానాన్ని వీడుతున్న సమయంలో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని.. అంపైర్లను అడిగి మరి బంతి తీసుకున్నాడు. ఈ సంఘటనతో ధోని క్రికెట్‌కు పూర్తి స్థాయిలో వీడ్కోలు పలికినట్లు తీవ్రస్థాయిలో ఊహాగానాలకు తెరలేచాయి. ధోని రిటైర్మెంట్‌ ఊహాగానాలకు భారత ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి చెక్‌ పెట్టాడు. బుధవారం ఓ ప్రముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్‌ వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధోని ఎటూ వెళ్లటం లేదు.. టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ఉంటాడు. బంతిని బౌలింగ్‌ కోచ్‌   చూపించడానికే తీసుకున్నాడు తప్పా ఏ రిటైర్మెం‍ట్‌ ఉద్దేశం లేదు’ అంటూ రవిశాస్త్రి ‘ధోని-బంతి’ మిస్టరీపై వివరణ ఇచ్చారు.   

Related Posts