YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సవాల్ కు ప్రతి సవాల్

 సవాల్ కు ప్రతి సవాల్

- కేటీఆర్ సవాల్‌ను స్వీకరించన ఉత్తమ్

"2019లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకునే ధైర్యం తనకుందని.. ఒకవేళ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డికు రాజకీయ సన్యాసం తీసుకునే ధైర్యం ఉందా?" అంటూ కేటీఆర్ చేసిన సవాల్‌ను స్వీకరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తమ కుటుంబమంతా రాజకీయ సన్యాసం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాదు కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటుందా? అంటూ ఉత్తమ్ ప్రతిసవాల్‌ను విసిరారు. రాజకీయాల్లో కేటీఆర్ ఓ బచ్చా అని.. కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడానికి ఆయనకు సిగ్గుండాలి అని అన్నారు. అధికారంతోనే కేటీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని, కమీషన్ల కోసం పనిచేసే మీరు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటంబ పాలన ఇలానే కొనసాగితే ప్రమాదమని, మీరు చెబుతున్నట్లుగా అద్భుతంగా పరిపాలన చేస్తున్నప్పుడు విమర్శలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇక 2019లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ అంటూ ఈ సందర్భంగా మరోసారి ఉద్ఘాటించారు ఉత్తమ్.

 కేటీఆర్‌కు గ్రహణం పట్టింది..

. టీఆరెస్ పార్టీకి గద్వాల్ నుంచే గ్రహణం పట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న కేటీఆర్ మాట నమ్మలా? కేసీఆర్ మాట నమ్మాలో? అర్థం కావట్లేదని ఆమె చెప్పుకొచ్చారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన మీ నాన్న బాటలో నడుస్తున్నవా కేటీఆర్? అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. మంత్రి చేసిన ప్రకటననే సీఎం కేసీఆర్ మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందన్నారు. 

కాంగ్రెస్‌దే విజయం..
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో అధికారంలోకి రానుందని డీకే అరుణ జోస్యం చెప్పారు. 20 సంవత్సరాలు టైం ఇవ్వండి అని కేటీఆర్ ప్రజలను అడుగుతున్నారని.. అందుకే రానున్న రోజుల్లో ప్రజలే టీఆరెస్‌‌కు గట్టిగా జవాబు ఇస్తారన్నారు.టీఆరెస్ పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా రాబోయే రోజుల్లో అధికారంలోకి రానే రాదన్నారు.

టీఆర్ఎస్‌‌ అపజయ యాత్ర ప్రారంభం..!
"నిన్న నా నియోజక వర్గంలో కేటీఆర్ పర్యటిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సందట్లో సడేమియా లాగా  కేటీఆర్ వచ్చి ప్రజలకి ఇబ్బంది పెట్టేలా సభ నిర్వహించడం.. 5వేల మంది కూడా పట్టని ప్రాంతంలో సభ పెట్టి కేటిఆర్‌‌కి అనుభవం లేని విషయం బయటపడింది" అని ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు. గద్వాల్ నుంచే టీఆరెస్ పార్టీ విజయ యాత్ర అని కేటీఆర్ ప్రకటించారు కానీ అది జైత్ర యాత్ర కాదని.. పరాజయం యాత్రని ఎమ్మెల్యే చెప్పారు.

Related Posts