YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

భారీ నష్టాల్లో

భారీ నష్టాల్లో

అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు రుచించడం లేదు. దీర్ఘకాల మూలధన లాభం రూ. లక్ష మించితే 10శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ నిర్ణయం మార్కెట్‌ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. గురువారం జైట్లీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలోనే సెన్సెక్స్ 400 పాయింట్ల మేర నష్టపోయినా...ఆ తర్వాత నష్టాలను భర్తీ చేసుకుంది. శుక్రవారం ప్రతికూల సెంటిమెంట్‌ కొనసాగుతుండటంతో సూచీలు భారీగా పతనమవుతున్నాయి.

ఇంట్రాడే‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోయి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 35,314.97 పాయింట్లకు పతనమయ్యింది. అటు నిఫ్టీ కూడా 10,850 పాయింట్ల దిగువునకు పడిపోయింది. కొద్దిసేపటి క్రితం సెన్సెక్స్ 539 పాయింట్ల నష్టంతో 35,368 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా...నిఫ్టీ 163 పాయింట్ల నష్టంతో 10854 పాయింట్ల దగ్గర ట్రేడ్ కొనసాగిస్తోంది. బ్యాంకింగ్ రంగ షేర్లను వదిలించుకునేందుకు మదుపర్లు మొగ్గుచూపుతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 

Related Posts