YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఐటీ రిటర్నుల మీకోసం..

ఐటీ రిటర్నుల మీకోసం..

- ఈ 4 విషయాలు తెలుసుకోవాలి 

బడ్జెట్‌లో ఉద్యోగులకు చిన్నపాటి నిరాశనే మిగిల్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే, మరికొన్ని మినహాయింపులనూ ఇచ్చింది. వాటి మాటెలా ఉన్నా ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. అందులో ముఖ్యమైనవి నాలుగు...

 వేతనం నుంచి సంస్థ టీడీఎస్‌ను కట్ చేసి, ఫార్మ్ 16ను ఇస్తుంది. కంపెనీ ఎలాగూ ఫాం ఇచ్చింది కాబట్టి ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారేమో. కానీ, విధిగా ఐటీ రిటర్నులను దాఖలు చేయాల్సిందే. 
జూలై 31 నాటికి ఐటీ రిటర్నులను దాఖలు చేయకపోతే.. ఆ తర్వాత ఏడాది వరకూ రిటర్నులను దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఓ ఏడాది పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుందన్నమాట. అంటే 2017-18 నాటికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయలేకపోతే 2019 మార్చి 31 వరకూ రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుందన్న మాట. 
ఇక, సేవింగ్స్ ఖాతాల్లోని నగదుకు వచ్చే వడ్డీలపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాలోని అసలుకు రూ.10 వేలకు పైబడి వస్తే దానికీ పన్ను పడుద్దన్నమాట. 10 వేలకు లోపు అయితే మాత్రం ఎలాంటి వడ్డీ ఉండబోదు. అదే వృద్ధులకు అయితే.. 50 వేల వరకు అవకాశం ఉంటుంది. 50 వేలు దాటితే పన్ను పడుతుంది.
నెలకు 50 వేలకు పైబడి ఇంటి అద్దె కట్టేవాళ్లు 5 శాతం టీడీఎస్‌‌ను కచ్చితంగా తీసేయాల్సిందే. అయితే, దానికి మాత్రం ఆ ఇంటి యజమానికి లాభం కలుగుతుందే తప్ప.. అద్దెకుండే వ్యక్తికి మాత్రం పన్ను మినహాయింపలు రావు. 

Related Posts