YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

రెండో టెస్టుకు స్టోక్స్ దూరం..!!

 రెండో టెస్టుకు స్టోక్స్ దూరం..!!

ఇంగ్లాండ్ స్టార్ అల్-రౌండర్ బెన్ స్టోక్స్ లార్డ్స్ లో జరిగే రెండో టెస్టుకు దూరం కానున్నాడు. గత ఏడాది బ్రిస్టల్‌లో ఓ క్లబ్‌ వద్ద ఒక వ్యక్తిని గాయపరిచిన కేసులో నిందితుడిగా ఉన్న స్టోక్స్‌ కోర్టు విచారణకు హాజరుకావాల్సి రావడంతో లార్డ్స్‌ టెస్టుకు అతడు దూరం అయ్యాడు.  మరి అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
మరో వైపు మొదటి టెస్ట్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో స్టోక్స్‌ కొట్టిన ఓ షాట్‌కు ఆ బంతి సమీపంలో ఉన్న ఆ జట్టు ఫిజియో క్రెగ్‌ను బలంగా తాకింది. వెంటనే అప్రమత్తమైన జట్టు మేనేజ్‌మెంట్‌ క్రెగ్‌ను ఆస్పత్రికి తరలించింది. ఎక్స్‌ రే నిర్వహించగా దవడలో ఎముకలు చిట్లినట్లు తేలిందట. దీంతో శస్త్రచికిత్స నిర్వహించాలని వైద్యులు సూచించారట.

Related Posts