YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

భారీగా పతనమైన  స్టాక్ మార్కెట్లు

 బడ్జెట్ ధాటికి స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైపోతే.. పెట్టుబడిదారులు భారీగా సంపదను కోల్పోయారు. ఒక్క రోజే రూ.4,58,581.38 కోట్ల రూపాయలను నష్టపోయారు. 1,48,54,452 కోట్ల రూపాయలుగా ఉన్న ఇన్వెస్టర్ల సంపదలో ఒక్కరోజే రూ.4.6 లక్షల కోట్లకు కోత పడింది. కేంద్రం ఈక్విటీల మీద ఎల్టీసీజీ పన్నును 10 శాతం వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు కుంగిపోయాయి. తద్వారా మదుపరులు కూడా తమ సంపదను కోల్పోయారు. ‘‘బడ్జెట్ ప్రభావం వల్లే నేటి మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈక్విటీపై ఎల్టీసీజీ పన్ను, మ్యూచువల్ ఫండ్లపై పన్నులు, ఆర్థిక లోటు తదితర కారణాలు భారీ ప్రభావాన్ని చూపించాయి. బడ్జెట్ తర్వాత దలాల్ స్ట్రీట్ బాగా నిస్తేజపోయింది’’ అని సెంట్రమ్ వెల్త్ మేనేజ్ మెంట్ ఈక్విటీ అడ్వైజరీ హెడ్ దేవాంగ్ మెహతా అన్నారు. కాగా, 30 షేర్లున్న సెన్సెక్స్‌లో 27 స్టాకులు భారీ నష్టాలను చవిచూడగా అందులో భారీ నష్టాలను మూటగట్టుకున్నవి మాత్రం బజాజ్ ఆటో, భారతి ఎయిర్‌టెల్‌లు మాత్రమే. 

Related Posts