YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భవిష్యత్‌లో స్వర్ణపతకం సాధించడమే లక్ష్యం: పీవీ సింధు

భవిష్యత్‌లో స్వర్ణపతకం సాధించడమే లక్ష్యం: పీవీ సింధు
భవిష్యత్‌లో స్వర్ణపతకం సాధించడమే తన లక్ష్యమని బ్యాడ్మింటన్‌ పీవీ సింధు అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని సింధు పేర్కొన్నారు. స్వర్ణ పతకం సాధించేందుకు శతవిధాలా కృషి చేశానని... తొలి రౌండ్‌లో మారిన్‌కు గట్టి పోటీ ఇవ్వగలిగానని ఆమె అన్నారు. చైనాలో ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం స్వదేశానికి చేరుకున్న సింధు మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అనేది పెద్ద టోర్నీ అని.. అక్కడ అందరూ గట్టి ప్రత్యర్ధులే ఉంటారని సింధు అన్నారు. అందరూ పతకం సాధించాలన్న లక్ష్యంతోనే అక్కడికి వస్తారని.. తాను కూడా అలాగే వెళ్లానని తెలిపారు. తాను వంద శాతం ఏకాగ్రతతో ఆడినందువల్లే రజత పతకం సాధించగలిగానన్నారు. తనకు ఫైనల్‌ ఫోబియా లేదని.. చాలామంది ఫైనల్‌కు రాకుండానే వెనుదిరుగుతున్నారని సింధు తెలిపారు. ఫైనల్లో ఓడిపోయానని బాధపడే బదులు.. తన ఖాతాలో మరో పతకం వచ్చిందని సంతోషపడతానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది తనకు స్వర్ణ పతకం వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. తాను ప్రతిసారి ఫైనల్‌కు వచ్చి ఓడిపోతున్నానని చాలామంది అడుగుతున్నారని.. కానీ ఫైనల్‌కు రావడం ఎంత కష్టమో వారు తెలుసుకోవాలన్నారు. ఫైనల్లో ఎవరైనా గెలవడానికే ఆడతారని పేర్కొన్నారు. ఫైనల్లో ఒడిపోయినందుకు కొంత బాధ ఉన్నప్పటికీ.. తన బలహీనతల నుంచి మరింత నేర్చుకుని అనుకున్న ఫలితం సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని సింధు అన్నారు

Related Posts