YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

జహీరాబాద్ ‘నిమ్జ్’కు ఆమోదం తెలిపిన కేంద్రం

జహీరాబాద్ ‘నిమ్జ్’కు ఆమోదం తెలిపిన కేంద్రం

  తెలంగాణ రాష్ట్రంలోని  జహీరాబాద్ జాతీయ పెట్టుబడి-వస్తూత్పత్తి మండలం(నిమ్జ్) అభివృద్ధికి పరిశీలనాంశాలు (టి.ఓ.ఆర్) రూపొందించడానికి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కిందనున్న కమిటీ ఒకటి ఆమోదం తెలిపింది. ‘నిమ్జ్’ వస్తుందని భావిస్తున్నచోట చుట్టుపక్కల 13 రిజర్వు అడవులు ఉన్నాయని, మరికొన్ని కారణాలు చూపుతూ, మంత్రిత్వ శాఖ కిందనున్న నిపుణుల మదింపు కమిటీ ఈ అంశంపై తన నిర్ణయాన్ని ఇంతకుముందు వాయిదా వేసింది. ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టి.ఎస్.ఐ.ఐ.సి) నుంచి వివరణలు పొందిన తర్వాత, పరిశీలనాంశాలు, ఇతర సంబంధిత నివేదికలు తయారు చేయుడానికి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. సుమారు 12,635 ఎకరాలలో ఈ ప్రాజెక్టును తీసుకురానున్నారు. జహీరాబాద్ ‘నిమ్జ్’కు కేంద్రం ఈ ఏడాది జనవరి 22న తుది ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత ‘నిమ్జ్’లోకి వస్తూత్పత్తి సంస్థలు దాదాపు రూ. 37,740 కోట్ల పెట్టుబడులు తీసుకువస్తాయని అంచనా. తుది దశలో 2040 నాటికి అక్కడ రూ. 96,778 కోట్ల విలువైన పారిశ్రామిక ఉత్పత్తి ఉండగలదని అంచనా. ‘నిమ్జ్’ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.44 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలదని భావిస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 4,704.90 కోట్లుగా చెబుతున్నారు.

జహీరాబాద్ నుంచి దేశ పశ్చిమ ప్రాంతంలోని పోర్టులకు ఎన్.హెచ్-65ని ఉన్నతపరచడంతో సహా, ఆ ప్రాంతానికి బయట ప్రాంతాల నుంచి అనుసంధానానికి మరో రూ. 6,500 కోట్లు ఖర్చు పెడతారని చెబుతున్నారు. రంగా రెడ్డి జిల్లా యాచారం సమీపంలో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు మాత్రం పర్యావరణపరైమెన అనుమతి మంజూరు చేసే నిర్ణయాన్ని నిపుణుల కమిటీ వాయిదా వేసింది. దానికి సంబంధించి అదనపు సమాచారాన్ని కోరింది. 

Related Posts