YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విదేశీయం

అందమైన మహిళలు ఉన్నంతవరకూ రేప్ లు జరుగుతూనే ఉంటాయి! ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు దుతర్తే చెత్త వ్యాఖ్యలు మనీలా సమావేశంలో నోరుజారిన నేత దుమ్మెత్తిపోస్తున్న మహిళా సంఘాలు

అందమైన మహిళలు ఉన్నంతవరకూ రేప్ లు జరుగుతూనే ఉంటాయి!                   ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు దుతర్తే చెత్త వ్యాఖ్యలు మనీలా సమావేశంలో నోరుజారిన నేత   దుమ్మెత్తిపోస్తున్న మహిళా సంఘాలు
వివాదాలతో సహవాసం చేసే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే అత్యాచారాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందమైన అమ్మాయిలు, మహిళలు ఉన్నంతవరకూ అత్యాచారాలు తగ్గవని వ్యాఖ్యానించాడు. రోడ్రిగో సొంత పట్టణం డవావోలో ఇటీవలి కాలంలో అత్యాచారాలు పెరిగాయన్న నివేదికపై ఆయన దుతర్తే ఈ మేరకు స్పందించాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై అక్కడి మహిళా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.మనీలాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో దుతర్తే మాట్లాడుతూ..‘డవావో పట్టణంలో అత్యాచారాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. అందమైన యువతులు, మహిళలు ఎక్కువయ్యే కొద్దీ అత్యాచారాలు పెరుగుతూనే ఉంటాయి’ అని వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగకుండా ‘పురుషుడు కోరగానే ఏ మహిళ అయినా శృంగారానికి ఒప్పకుంటుందా? ఒప్పుకోదు.  హా..హా..హా.. అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి’ అని చెత్త వ్యాఖ్యలు చేశాడు.రోడ్రిగో దుతర్తే ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2017లో ఓ సారి దుతర్తే మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక దాడులను తాను సహించబోననీ, కానీ విశ్వ సుందరి పోటీల్లో నెగ్గినవారిపై రేప్ జరిగితే తనకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించాడు. అంతకుముందు ఏడాది ఓ సమావేశంలో సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మార్షల్ లా సందర్భంగా మీరు ముగ్గురిని రేప్ చేసిన ఫర్వాలేదు. నేను చూసుకుంటాను’ అని చెత్త వ్యాఖ్యలు చేశాడు.

Related Posts