YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

అవినీతి బట్టబయలు అవుతుందనే బాబు భయం;ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

అవినీతి బట్టబయలు అవుతుందనే బాబు భయం;ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

అవినీతి బట్టబయలు అవుతుందనే చంద్రబాబు భయపడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. మోడీ సర్కార్‌తో యుద్ధమంటూ మీడియాకు లీకులిచ్చారు. తర్వాత ఎన్డీఏలో కొనసాగుతామని అధికారిక ప్రకటనలు చేయడంలో ఆంతర్యమేంటో చెప్పాలన్నారు.  ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడ్డారని విమర్శించారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ కూడా సాధించలేకపోయారు.  విభజన హామీలను సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు డిమాండు న్యాయమైనదే అన్నారు.  అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి టీడీపీదే బాధ్యత అని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.

Related Posts