YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సర్కార్ లో పనిచేయలేమంటున్న ఐఏఎస్, ఐపీఎస్ లుఁ

ఏపీ సర్కార్ లో పనిచేయలేమంటున్న ఐఏఎస్, ఐపీఎస్ లుఁ

విజయవాడ జూలై 8, 
ఏపీ ప్రభుత్వం  తీరుపై కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆగ్రహంగా ఉన్నారా? కక్ష సాధింపునకు దిగుతోందని ఆందోళనతో ఉన్నారా? ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? మరి కొందరు నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. రెండు రోజుల కిందట ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామాకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. వాలంటరీ రాజీనామాతో పెద్ద ప్రకంపనలు సృష్టించారు. అయితే ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వ బాధిత ఐఏఎస్, ఐపీఎస్ లు కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వ తీరు బాగాలేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారట.ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. వైసిపి హయాంలో అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న అధికారులపై ఫోకస్ పెట్టింది కూటమి. అప్పటి వైసిపి ప్రభుత్వ పెద్దలతో అంటగాకి తమను ఇబ్బంది పెట్టిన వారిని పోస్టులు ఇవ్వకుండా చేసింది. కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇతర రాష్ట్రాల్లో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేశారు. మరికొందరైతే స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రయత్నించారు. అందుకు అంగీకారం తెలపక పోగా కొంతమంది పై కేసులు కూడా నమోదయ్యాయి. నీతో బాధిత అధికారులంతా కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చాలామంది అధికారులను పక్కన పెట్టింది. వారికి పోస్టింగులు ఇవ్వలేదు. రాష్ట్రంలోనే సీనియర్ అధికారిగా గుర్తింపు సాధించిన శ్రీలక్ష్మి కి పోస్టింగ్ ఇవ్వలేదు. చీఫ్ సెక్రటరీ అర్హత జాబితాలో ఆమె తొలి స్థానంలో ఉన్నారు. జగన్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు సీనియర్ ఐఏఎస్ అధికారి ముత్యాలరాజు. ఆయనకు సైతం పోస్టింగ్ ఇవ్వలేదు. మురళీధర్ రెడ్డి, మాధవి లత, నీలకంఠ రెడ్డికి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఐపీఎస్ లపై సైతం అదే ధోరణి కొనసాగింది. రఘురామిరెడ్డి, విశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి పై కక్ష సాధింపు చర్యలకు దిగిందన్న విమర్శలు ఉన్నాయి. పీఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, పీవీ సునీల్, క్రాంతి రానా, విశాల్ గున్నీలపై సైతం సక్సెస్ సాధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఐపీఎస్ అధికారి వాలంటరీ రిటైర్మెంట్ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ తరుణంలో ప్రభుత్వ బాధ్యత అధికారులంతా కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Posts