YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

94 వేల కోట్ల దాటిన జీఎస్టీ

Highlights

 

94 వేల కోట్ల దాటిన  జీఎస్టీ

ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబరు నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. గత నెలలో రూ. 94,442 కోట్లు జీఎస్టీ కింద వసూలు చేశామని ప్రకటించింది. ఆగస్టులో రూ.93,690 కోట్ల పన్ను వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అత్యంత తక్కువ వసూళ్లు ఆగస్టులోనే జరగడం గమనార్హం. ఏప్రిల్‌లో అత్యంత ఎక్కువగా రూ.1.03 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. మొత్తం 67 లక్షల వ్యాపార సంస్థల నిర్వాహకులు గత నెలలో రిటర్నులు దాఖలు చేశారు. సెప్టెంబరులో వసూలైన రూ. 94,442కోట్లలో కేంద్ర జీఎస్‌టీ రూ. 15,318కోట్లు .. రాష్ట్ర జీఎస్‌టీ రూ. 21,061కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ రూ. 50,070కోట్లు, సెస్‌ రూ. 7,993కోట్ల(దిగుమతులపై రూ. 769కోట్లు కలిపి) మేర ఉన్నాయి. సర్దుబాట్ల అనంతరం కేంద్ర జీఎస్‌టీ రూ. 30,574కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీ రూ. 35,015కోట్లుగా ఉంది. 

Related Posts