YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఏపీ హక్కుల డిమాండ్‌ న్యాయమైనది.. ఎంపీ కవిత

 ఏపీ హక్కుల డిమాండ్‌ న్యాయమైనది.. ఎంపీ కవిత

విభజన హామీలను అమలు చేయాలన్న డిమాండ్‌తో ఏపీ ఎంపీలు పార్లమెంటులో గత మూడు రోజులుగా సాగిస్తున్న ఆందోళనకు టీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఏపీ ఎంపీల నిరసనలకు మద్దతిస్తున్నట్లు నిజామాబాద్ ఎంపీ కవిత ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్‌‌లో మాట్లాడిన ఆమె... ఏపీ హక్కుల కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న డిమాండ్‌ న్యాయమైనదిగా చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూ నిరసనలు తెలుపడం సరైన పద్ధతి కాదని ఆమె పరోక్షంగా టీడీపీ ఎంపీలకు చురకంటించారు. కేంద్రం వెంటనే స్పందించి ఏపీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సుమారు 10 నిమిషాల పాటు కవిత ఏపీ సమస్యల గురించి మాట్లాడారు. అటు తెలంగాణకు కేంద్రం మద్దతివ్వాలని కవిత కోరారు. జీఎస్టీ, నోట్లరద్దుకు తాము మద్దతునిచ్చామని గుర్తుచేసిన ఆమె...తెలంగాణకు కేంద్రం మద్దతునివ్వాలన్నారు. చివరగా ‘జై ఆంధ్రా’ అంటూ కవిత తన ప్రసంగాన్ని కవిత ముగించారు. అంతకు ముందు బుధవారం రోజు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంట్‌లో మాట్లాడుతూ..ఏపీ ఎంపీలకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. 

Related Posts