YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాలతో ముగిసిన మార్కెట్లు

 నష్టాలతో ముగిసిన మార్కెట్లు
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. రూపాయి బలపడటం, ముడిచమురు ధరల తగ్గుదలతో ఉదయం ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో సూచీలు నేలచూపు చూశాయి. ట్రేడింగ్లో ఆటోమొబైల్స్, ప్రభుత్వం రంగ బ్యాంకులు 2 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. మెటల్, ఫార్మా, ఇన్ఫ్రా, విద్యుత్ రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. చివరి గంటలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు మరింత దిగజారాయి.  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 345.56 పాయింట్ల నష్టంతో 34,812.99 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 10,482 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లకు కూడా నష్టాలు తప్పలేదు. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ ఉదయం బలపడినప్పటికీ.. ట్రేడింగ్ చివరకు 46 పైసల నష్టంతో 72.96 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈలో టైటన్ కంపెనీ (+5.56), టెక్ మహింద్రా (+2.45), టాటా స్టీల్ (+1.86), కొటక్ మహింద్రా (+1.60), సిప్లా (+0.93) షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు హెచ్పీసీఎల్ (-6.73), టాటా మోటార్స్ (-4.71), ఐవోసీ (-4.66), బజాజ్ ఫైనాన్స్(-4.12), హిండాల్కో (-4.00) షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

Related Posts