
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉమా భారతి కాంగ్రెస్ ఫై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రధాని మోదీని ఓడించేందుకు ఆ పార్టీ నాయకులు పాకిస్థాన్‌తో కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.‘‘బంగ్లాదేశ్ కోసం పాకిస్థాన్, భారత్ మధ్య పోరాటం నెలకొన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు, జనసంఘ్ అధినేత అటల్ బిహారీ వాజ్‌పేయీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి అండగా నిలిచారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పార్లమెంటులో ప్రకటించారు. కానీ భారత్ పాక్ ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆర్మీ చీఫ్‌ను ‘గూండా’గా అభివర్ణించారు. అంతేకాక ఓ కాంగ్రెస్ నేత పాకిస్థాన్ వెళ్లి ‘ప్రధాని నరేంద్రమోదీని మేం ఓడించాలనుకుంటున్నాం’ అని వారితో చెప్పారు. దీన్ని బట్టి వారు పాక్‌తో చేతులు కలిపినట్లు అర్థమవుతోంది. మోదీని ఓడించేందుకు దాయాది దేశంతో కలిసి కుట్రలు పన్నుతున్నారు.’’ అని మధ్యప్రదేశ్‌లోని ప్రచార సభలో ఉమా భారతి ఆరోపణలు చేశారు.ప్రధాని మోదీపై పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఉమాభారతి ఇలా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్‌లో కొత్తగా అధికారం చేపట్టిన ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిద్దూను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించకపోవడంతో మోదీ తనపై అసూయగా ఉన్నారని సిద్దూ ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో విలేకరులతో అన్నారు.