YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నోట్ల రద్దు, జీఎస్‌స్టీ తర్వాత దేశంలో ఆర్థిక వృద్ధి రేటు

నోట్ల రద్దు, జీఎస్‌స్టీ తర్వాత దేశంలో ఆర్థిక వృద్ధి రేటు
ప్రజా కూటమి ద్వారా తెలంగాణ ఎన్నికల బరిలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో ప్రొఫెసర్ జయశంకర్‌ను ‘తెలంగాణ జాతిపిత’గా పేర్కొనడం విశేషం. అమరులు కుటుంబాలకు ఉచిత బస్ పాస్, పింఛన్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఉద్యమకారులకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఒంటెద్దు పోకడతో పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీని గద్దె దించడమే తమ పార్టీ ప్రాధాన్యమని చిదంబరం వెల్లడించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, బీజేపీపై విమర్శలు కురిపించారు. నోట్ల రద్దు, జీఎస్‌స్టీ తర్వాత దేశంలో ఆర్థిక వృద్ధి రేటు మందగించిందని చిదంబరం ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో దేశంలో దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో జీడీపీ వృద్ధి రేటును ఏ ప్రాతిపదికన గణిస్తున్నారో అర్థం కాకుండా ఉందని విమర్శించారు. హౌస్ హోల్డ్ సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు, పరిశ్రమలు, రూపాయి విలువ, ఉద్యోగ కల్పన, ఎగుమతులు తిరోగమనంలో ఉండగా.. జీడీపీ వృద్ధి ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 4 రాష్ట్రాల్లో బీజేపీని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గద్దె దించడం తమ లక్ష్యమని తెలిపారు. 
తెలంగాణకు తన హృదయంలో ప్రత్యేక స్థానముందని చిదంబరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాకారానికి కారణమైన 2009 డిసెంబర్‌ 9 ప్రకటనను తాను ఎన్నడూ మరిచిపోలేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ముందడుగు అయిన డిసెంబర్‌ 9 ప్రకటనను నాటి కేంద్ర హోంమంత్రిగా తాను చేసిన విషయాన్ని చిదంబరం గుర్తుచేసుకున్నారు. 

Related Posts